ETV Bharat / sports

ఆసియా ఆర్చరీ కప్‌లో ధీరజ్‌ బృందానికి స్వర్ణం - ఆసియా కప్‌ ఆర్చరీ లో ధీరజ్​

Dhiraj Bommadevara: ఆసియా ఆర్చరీ కప్‌లో స్వర్ణం సాధించాడు ఆంధ్రప్రదేశ్‌ కుర్రాడు బొమ్మదేవర ధీరజ్‌. వ్యక్తిగత విభాగంలో విఫలమైన ఈ కుర్రాడు జట్టు విభాగంలో మరో ఇద్దరితో కలిసి పసిడి గెలిచాడు. శనివారం రికర్వ్‌ టీమ్‌ ఫైనల్లో ధీరజ్‌, పార్థ్‌ సాలుంకే, రాహుల్‌తో కూడిన భారత బృందం 6-2లో కజకిస్థాన్‌పై విజయం సాధించింది.

Dhiraj Bommadevara news
ధీరజ్‌
author img

By

Published : Mar 20, 2022, 6:43 AM IST

Dhiraj Bommadevara: ఆంధ్రప్రదేశ్‌ కుర్రాడు బొమ్మదేవర ధీరజ్‌ ఖాతాలో ఆసియా కప్‌ ఆర్చరీ స్వర్ణం చేరింది. వ్యక్తిగత విభాగంలో విఫలమైన ఈ కుర్రాడు జట్టు విభాగంలో మరో ఇద్దరితో కలిసి పసిడి గెలిచాడు. శనివారం రికర్వ్‌ టీమ్‌ ఫైనల్లో ధీరజ్‌, పార్థ్‌ సాలుంకే, రాహుల్‌తో కూడిన భారత బృందం 6-2లో కజకిస్థాన్‌ను ఓడించి పసిడి గెలుచుకుంది. ఇద్దరూ భారత ఆర్చర్లే తలపడిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌ ఆఖరి సమరంలో సాక్షి చౌదరి స్వర్ణం గెలుచుకుంది. ఈ పోరులో సాక్షి-పర్ణీత్‌ కౌర్‌ చెరో 140 పాయింట్లు సాధించడంతో షూటాఫ్‌ నిర్వహించారు. అందులోనూ ఇద్దరూ 10 పాయింట్లు సాధించినా.. మధ్య స్థానానికి చేరువగా బాణాన్ని సంధించిన సాక్షి పసిడి కైవసం చేసుకుంది.

మహిళల రికర్వ్‌ బృందం కొద్దిలో స్వర్ణం చేజార్చుకుంది. ఫైనల్లో రిధి, త్రిష, తనీషాలతో కూడిన భారత జట్టు 4-5తో బంగ్లాదేశ్‌ చేతిలో ఓడింది. టైబ్రేకర్‌లో భారత్‌ ఒక్క పాయింట్‌ (27-28) తేడాతో పసిడి కోల్పోయింది. కాంపౌండ్‌ పురుషుల వ్యక్తిగత ఫైనల్లో రిషబ్‌ యాదవ్‌ రజతంతో సరిపెట్టుకున్నాడు. తుది పోరులో అతడు 126-145తో మహ్మద్‌ సలె (ఇరాన్‌) చేతిలో ఓడాడు. కాంపౌండ్‌ పురుషులు, మహిళల టీమ్‌ విభాగాల్లోనూ భారత్‌ పసిడి గెలవలేకపోయింది. పురుషుల ఆఖరి సమరంలో భారత్‌ (ప్రథమేశ్‌-ప్రియాంశ్‌) 232-233తో కజకిస్థాన్‌ చేతిలో ఓడగా.. మహిళల ఫైనల్లో భారత్‌ (సాక్షి-అదితి) 230-231తో థాయ్‌లాండ్‌ చేతిలో పరాజయం చవిచూసింది. మరో రెండు కాంస్య పతకాలు కూడా మన చేజారాయి. మహిళల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో త్రిష పునియా 5-6తో నూర్‌ అమిర్‌ (మలేసియా) చేతిలో ఓడగా.. పురుషుల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో ప్రథమేశ్‌ 147-147తో సయీద్‌ (ఇరాన్‌)తో టై అయ్యాడు. అయితే టైబ్రేకర్‌లో ప్రథమేశ్‌ ఓడిపోయాడు.

ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్​.. ఆల్​ ఇంగ్లాండ్​​ ఓపెన్​ ఫైనల్లోకి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.