ETV Bharat / sports

Chess FIDE World Cup 2023 Final : రెండో మ్యాచ్​ కూడా డ్రా.. విజేత ఎవరో తేలేది అప్పుడే..

Chess FIDE World Cup 2023 Final : హోరాహోరీగా జరిగిన ఫిడే ప్రపంచకప్​ ఫైనల్స్ మరోసారి డ్రాగా ముగిసింది. దీంతో చెస్ గ్రాండ్ మాస్టర్​ ప్రజ్ఞానంద, మాగ్నస్ కార్ల్‌సెలో ఆఖరి విజేత ఎవరు అనే విషయాన్ని గురువారం నిర్ణయించనున్నట్లు అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్​ వెల్లడించింది.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2023, 5:59 PM IST

Updated : Aug 23, 2023, 6:25 PM IST

Chess FIDE World Cup 2023 Final : హోరాహోరీగా జరిగిన ఫిడే ప్రపంచకప్​ ఫైనల్స్ మరోసారి డ్రాగా ముగిసింది. దీంతో చెస్ గ్రాండ్ మాస్టర్​ ప్రజ్ఞానంద, మాగ్నస్ కార్ల్‌సెలో ఆఖరి విజేత ఎవరు అనే విషయాన్ని గురువారం నిర్ణయించనున్నట్లు అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్​ వెల్లడించింది. అంతకుముందు మంగళవారం జరిగిన ఫైనల్స్​ తొలి మ్యాచ్​ కూడా డ్రాగా డిక్లేర్ అవ్వడం వల్ల ఈ ఇద్దరూ రెండో క్లాసికల్ గేమ్‌లో తలపడ్డారు. ఇక తొలి గేమ్​లో బ్లాక్​ సైడ్​ తలపడ్డ మాగ్నస్.. రెండో గేమ్​లో వైట్స్​గా బరిలోకి దిగాడు.

అయితే అంతకుముందు జరిగిన సెమీఫైనల్‌ తొలి గేమ్‌లో భారత్​కు చెందిన ప్రజ్ఞానంద, అమెరికాకు చెందిన ఫాబియానో ​​కరువానాతో డ్రా చేసుకున్నాడు. ఈ క్రమంలో రెండవ గేమ్​ను కూడా ఫాబియానో ​​కరువానా డ్రా చేసుకోగలిగాడు. అందువల్ల ఫలితాన్ని నిర్ణయించడానికి టై బ్రేకర్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది.

Praggnanandhaa FIDE World cup 2023 : ఇక సోమవారం జరిగిన టై బ్రేకర్ గేమ్‌లో ప్రపంచ నంబర్ 3 చెస్ ప్లేయర్ ఫాబియానో ​​కరువానా.. ప్రజ్ఞానందపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ.. తన నిర్ణయాత్మక ఎత్తుగడలతో ప్రజ్ఞానంద.. గేమ్​పై పట్టు సాధించి డ్రాగా తీసుకెళ్లగలిగాడు. అలా 2వ టైబ్రేకర్ గేమ్‌లోనూ ప్రజ్ఞానంద ఫాబియానో ​​కరువానాను గెలవకుండా అడ్డుకున్నాడు. దీంతో మ్యాచ్ 10+10 టైబ్రేక్‌కు వెళ్లింది. ఆ తర్వాత జరిగిన మొదటి ర్యాపిడ్ టైబ్రేక్‌ను ప్రజ్ఞానంద గెలుచుకోవడం ద్వారా ఫాబియానోపై ఒత్తిడి తెచ్చాడు. ఆఖరికి ప్రజ్ఞానంద 3.5-2.5తో ఫాబియానో ​​కరువానాపై అద్భుత విజయం సాధించి ఫైనల్స్​కు చేరుకున్నాడు. ఈ విజయంతో 2024 క్యాండిడేట్‌ టోర్నీలో చోటు ఖాయం చేసుకున్న ప్రజ్ఞానంద.. బాబి ఫిషర్‌, కార్ల్‌సన్‌ తర్వాత ఆ పోటీల్లో తలపడే మూడో పిన్న వయస్సు ఆటగాడిగా నిలిచాడు.

Praggnanandhaa Chess Career : ఇక ప్రజ్ఞానంద కెరీర్​ విషయానికి వస్తే.. దేశంలోనే అత్యంత ప్రతిభావంతులైన చెస్ ఆటగాడిగా పేరొందిన ప్రజ్ఞానంద.. 10 సంవత్సరాల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఇక రెండేళ్లలోనే ప్రజ్ఞానంద గ్రాండ్ మాస్టర్​గా రాణించాడు విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ ఫైనల్స్​కు చేరిన రెండో భారతీయ ఆటగాడిగా ప్రజ్ఞానంద చరిత్రకెక్కాడు.

Praggnanandhaa Mother : ప్రజ్ఞానంద సక్సెస్ వెనుక అమ్మ ప్రేమ.. ఫారిన్​లోనూ రసం, సాంబార్​తో భోజనం.. స్టవ్, కుక్కర్​ తీసుకెళ్లి మరీ..

Chess FIDE World Cup 2023 Final : డ్రాగా ముగిసిన చెస్​ ఫైనల్స్​.. మరోసారి తలపడనున్న ప్రజ్ఞానంద, మాగ్నస్

Last Updated : Aug 23, 2023, 6:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.