కొవిడ్‌తో పోరాడుతున్న దేశానికి మద్దతు ప్రకటించారు భారత చెస్ క్రీడాకారులు విశ్వనాథన్ ఆనంద్, కొనేరు హంపి, ద్రోణవల్లి హరిక, నిహాల్ సారిన్, ప్రజ్ఞానందా రమేష్ బాబు. విరాళాల సేకరణకు ముందుకొచ్చారు. చెక్‌మేట్ కొవిడ్ పేరుతో చెస్.కామ్‌లో వరుస ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
"ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే వారికి చెస్.కామ్ 2000 లోపు బ్లిట్జ్ లేదా ఫైడ్ ప్రమాణాలు ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం రూ.1838లు(25 డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచ మాజీ ఛాంపియన్ ఆనంద్‌తో పోటీలో పాల్గొనాలంటే రూ.11 వేలు(150 డాలర్లు) విరాళం ఇవ్వాల్సి ఉంటుందని" చెస్.డామ్ వెల్లడించింది.
“దేశంలో కొవిడ్ ధాటికి ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ప్రభావితమయ్యారు. అందుకే వారికి అండగా ఉండేందుకు విరాళాలను సేకరించాలని అనుకున్నాం. దేశంలోని చాలా మంది కొవిడ్ బారిన పడుతున్నారు. వారికి మద్దతుగా నిలిచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. భారత గ్రాండ్మాస్టర్లతో పోటీ పడే అవకాశం ఉంది. చెస్.కామ్‌లో మీ విరాళాలు ఇచ్చి.. ఈ పోటీల్లో పాల్గొనాలని కోరుతున్నాం. గురువారం రాత్రి 7.30 గంటలకు చెక్‌మేట్ కొవిడ్ పేరుతో ఈ పోటీలు ప్రారంభమవుతాయి.”
-విశ్వనాథన్ ఆనంద్, భారత చెస్ ఆటగాడు.
ఇదీ చదవండి: ఐపీఎల్ వాయిదాకు 'ప్రాక్టీస్ సెషన్లే' కారణమా?