మైదానంలో చురుకైన ఫీల్డింగ్‌తో అదరగొడుతుంటారు క్రికెటర్లు. కొన్నిసార్లు అద్భుత విన్యాసాలతో క్యాచ్‌లు పడుతుంటారు. తమ శరీరాన్ని అనుకున్నట్లుగా మలచుకుంటూ వారు చేసే ఫీల్డింగ్ కొన్నిసార్లు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఓ పిల్లి ఇదంతా చేయగలదా. మెరుపు వేగంతో వచ్చే బంతిని క్యాచ్ పట్టుకోగలదా. కొంత ఫన్నీగా ఉన్నా ఇదే నిజం. ఓ పిల్లి తన అద్భుత క్యాచ్‌లతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత డీన్ జోన్స్ తాజాగా ట్విట్టర్లో ఓ వీడియో షేర్ చేశాడు. "చాలా చెత్త ఫీల్డర్లను నేను చూశా. నేను హామీ ఇస్తున్నా" అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు, ఇందులో ఓ పిల్లి తన ఓనర్‌కు క్యాచ్ పట్టడంలోే సహాయం చేస్తూ కనిపించింది. గోల్ఫ్ బ్యాట్‌తో ఆమె కొడుతున్న బంతులను చురుగ్గా, పర్ఫెక్ట్ టైమింగ్‌తో పిల్లి క్యాచ్‌లు పట్టిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
-
I have seen worst fielders I can assure you! #whatacatch #gothim pic.twitter.com/qnP0YpPADO
— Dean Jones AM (@ProfDeano) August 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I have seen worst fielders I can assure you! #whatacatch #gothim pic.twitter.com/qnP0YpPADO
— Dean Jones AM (@ProfDeano) August 4, 2020I have seen worst fielders I can assure you! #whatacatch #gothim pic.twitter.com/qnP0YpPADO
— Dean Jones AM (@ProfDeano) August 4, 2020