ETV Bharat / sports

World Chess Championship 2021: కార్ల్‌సన్‌కు ఎదురుందా? - మాగ్నస్ కార్ల్​సన్ న్యూస్

World Chess Championship 2021: ప్రపంచ చెస్‌ ఛాంపియన్​షిప్ సమరం శుక్రవారం(నవంబర్ 26) నుంచే ప్రారంభం కానుంది. దుబాయ్‌ వేదికగా జరిగే ఈ పోరులో ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్​సన్, రష్యా ఆటగాడు ఇయాన్ నిపోమ్​నిషి తలపడనున్నారు.

carlsen-vs-nepomniachtchi
కార్ల్​సన్, ఇయాన్ నిపోమ్​నిషి
author img

By

Published : Nov 26, 2021, 7:43 AM IST

World Chess Championship 2021: మాగ్నస్‌ కార్ల్‌సన్‌.. ప్రపంచ చెస్‌లో తిరుగులేని రారాజు. 2013లో విశ్వనాథన్‌ ఆనంద్‌ను ఓడించి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ గెలిచిన దగ్గర నుంచి అతడే ఛాంపియన్‌. ఇప్పటికి నాలుగుసార్లు విజేతగా నిలిచాడు. మరోసారి అతడు టైటిల్‌ నిలబెట్టుకుంటాడా..? మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

కార్ల్​సన్​ను ఢీకొనేందుకు రష్యా ఆటగాడు ఇయాన్‌ నిపోమ్‌నిషి సిద్ధమయ్యాడు. దుబాయ్‌లో శుక్రవారం వీరిద్దరి మధ్య ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌నకు తెరలేవనుంది. ఇద్దరి మధ్య పద్నాలుగు గేమ్‌ల్లో విజేత ఎవరో తేలకపోతే.. డిసెంబరు 15న టైబ్రేక్‌ నిర్వహిస్తారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తలపడడం కార్ల్‌సన్‌కు ఇది అయిదోసారి కాగా.. నిపోమ్‌నిషికి ఇదే తొలిసారి.

ఇదీ చదవండి:

ఈసారి వ్యాఖ్యాతగా చెస్ దిగ్గజం ఆనంద్

'ఆ పాత్రలో ఆమిర్ ఖాన్​ నటిస్తే బాగుంటుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.