ETV Bharat / sports

స్టేడియాల్లో మళ్లీ జనాలు కనిపించేదెప్పుడు? - కిరెన్​ రిజిజు

స్టేడియాల్లో ఇప్పట్లో జనాలను చూడటం కష్టమని క్రీడా శాఖ మంత్రి కిరణ్​ రిజిజు తెలిపారు. ఇటీవలే ఓ కార్యక్రమంలోపాల్గొన్న ఆయన ఈ విషయంపై తన అభిప్రాయాలు పంచుకున్నారు.

Rijiju
రిజిజు
author img

By

Published : Sep 4, 2020, 5:24 PM IST

Updated : Sep 4, 2020, 5:32 PM IST

అన్​లాక్​-4 ప్రక్రియలో భాగంగా సెప్టెంబరు 21 నుంచి 100 మందితో కూడిన క్రీడా సమావేశాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే, జనాలు ఎప్పుడు స్టేడియాలకు తిరిగి వస్తారో సరిగ్గా చెప్పలేమని క్రీడా మంత్రిత్వ శాఖ మంత్రి కిరణ్​ రిజిజు తెలిపారు. ఆటగాళ్లకు ఆన్​లైన్ శిక్షణ అందించేందుకు బైచుంగ్​ భూటియా ఫుట్​బాల్ స్కూల్​ రూపొందించిన ఎన్జోగో అనే యాప్​ లాంచ్​ వర్చువల్​ వేడుకలో పాల్గొన్న రిజిజు.. ఈ సందర్భంగా తన అభిప్రాయాలు పంచుకున్నారు.

Rijiju
రిజిజు

"స్టేడియానికి ప్రేక్షకులను అనుమతించడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వచ్చే 1, 2 నెలల్లో కరోనా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. వీలైనంత త్వరగా అభిమానులను స్టేడియాల్లోకి రప్పించాలని నేను కూడా కోరుకుంటున్నా. త్వరలోనే ఇది జరగాలని ఆశిస్తున్నాం. అయితే, ప్రజల ఆరోగ్యం, భద్రత కూడా మా ప్రాధాన్యం."

-కిరణ్​ రిజిజు, క్రీడా శాఖ మంత్రి

సమావేశాల్లో ఫేస్​ మాస్కులు, భౌతిక దూరం, థర్మల్​ స్కానింగ్​, హ్యాండ్​ వాష్​ తదితర నిబంధనలు తప్పనిసరని కేంద్ర హోం మంత్రిత్వశాఖ తెలిపింది. అయితే, కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి.. స్టేడియాల్లో జనాలను ఎప్పుడు అనుమతించాలనే దానిపై స్థానిక అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రిజిజు చెప్పారు.

Last Updated : Sep 4, 2020, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.