ETV Bharat / sports

బౌట్ కోసం విద్యుత్​ తీగలతో టైసన్​ ప్రాక్టీస్​ - boxing legend mike tyson

పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రింగ్‌లోకి అడుగుపెడుతున్నాడు బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్. సెప్టెంబరు 12న జరగనున్న ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో టైసన్ పాల్గొననున్నాడు. అయితే ఈ పోరు సన్నాహాల్లో భాగంగా ఎలక్ట్రికల్​ స్టిములేషన్‌ పరికరం సాయంతో.. కండరాల వ్యాయామం చేస్తున్నాడు టైసన్. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి.

mike tyson latest news
విద్యుత్​ తీగలతో మైక్​ టైసన్​ ప్రాక్టీస్​
author img

By

Published : Aug 7, 2020, 8:29 AM IST

దిగ్గజ బాక్సర్​ మైక్​ టైసన్​.. ఎంతటి మహాబలుడో.. అతను ఫామ్​లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రత్యర్థినైనా ఎలా మట్టి కరిపించాడో క్రీడా ప్రేమికులకు బాగా తెలుసు. కానీ 54 ఏళ్ల వయసులో ఒక ఛారిటీ మ్యాచ్​ కోసం మళ్లీ రింగ్​లోకి దిగున్న ఈ యోధుడు.. ఊహించని రీతిలో కష్టపడుతున్నాడు.

ఆగస్టు 12న రాయ్​ జోన్స్​తో జరగబోయే బౌట్​ కోసం అతను శరీరానికి విద్యుత్​ తీగలను పెట్టుకొని కండరాలు ఉత్తేజం పొందేలా వ్యాయామం చేస్తున్నాడు. ఎలక్ట్రికల్​ మజిల్​ స్టిములేషన్​ లేకుండా తాను మునుపటిలా పోటీపడలేనని... అందుకే జోన్స్​తో బౌట్​కు ఇలా సిద్ధమవుతున్నానని టైసన్​ చెప్పాడు. మైక్​ ట్రైనింగ్​ అవుతున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతం అవుతున్నాయి.

  • Mike Tyson is undergoing electric muscle stimulation to help prepare for the Roy Jones Jr bout. He said: "I couldn't do it without that, my joints would be all f***ed. Those pains came back and I said, 'Wow, this is why I stopped boxing.' Then I got this [machine]." [@Triller] pic.twitter.com/zo2nnkzkr4

    — Michael Benson (@MichaelBensonn) August 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

1986లో 20 ఏళ్ల వయసులోనే టైసన్​ హెవీ వెయిట్​ ఛాంపియన్​గా నిలిచాడు. కెరీర్​లో ఎన్నో మరుపురాని విజయాలు సాధించాడు. 2005లో చివరి బౌట్​లో తలపడ్డాడు. పునరాగమనంలో అతను తలపడబోయే రాయ్​జోన్స్​.. 4-డివిజిన్​ ఛాంపియన్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.