గత శనివారం చికాగో వేదికగా జరిగిన సూపర్ వాల్టర్వెయిట్ బౌట్లో గాయపడిన అమెరికన్ బాక్సర్ పేట్రిక్ కోమాలోకి వెళ్లాడు. అనంతరం నాలుగురోజులపాటు మృత్యువుతో పోరాడి, బుధవారం తుదిశ్వాస విడిచాడు. అతడికి ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్న లూ డిబెల్లా ఈ విషయంపై మాట్లాడాడు.
"పేట్రిక్.. ఓ కొడుకు, తమ్ముడు, చాలా మందికి మంచి స్నేహితుడు. కలిసిన వారందరూ అతడ్ని అభిమానిస్తారనడంలో సందేహం లేదు" -లూ డిబెల్లా, పేట్రిక్ ప్రమోటర్
చార్లెస్ కాన్వెల్తో జరిగిన ఈ పోరులో, రెండుసార్లు గాయపడ్డ పేట్రిక్.. మూడోసారి పంచ్ పెద్దగా తగలడం వల్ల బౌట్‌ను కొనసాగించలేకపోయాడు. అప్పుడు స్ట్రెచర్‌పై అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఇది చదవండి: నాపై వార్తలు అవాస్తవం.. నేను బతికే ఉన్నాను: అఫ్గాన్ క్రికెటర్ నబీ