ETV Bharat / sports

విరామంలోనూ కసరత్తులకు సై అంటోన్న ఆటగాళ్లు - corona news update

కరోనా వైరస్‌ కారణంగా క్రీడా రంగం స్తంభించిపోయింది. ఆ ఆట.. ఈ ఆట అని తేడాలేమీ లేకుండా అన్నీ ఆగిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని టోర్నీలు రద్దయ్యాయి. మరికొన్ని వాయిదా పడ్డాయి. దీంతో క్రీడాకారులంతా ఖాళీ అయిపోయారు. మళ్లీ ఎప్పుడు ఆటలు మొదలవుతాయో.. మైదానంలోకి వెళ్లేదెప్పుడో తెలియని అయోమయంలో ఉన్నారు. మరి ఈ ఖాళీ సమయంలో ఏం చేయాలి అంటే.. ఫిట్‌నెస్‌ మెరుగుపరుచుకోవడమే అంటున్నారు ప్రముఖ క్రీడాకారులు.

Athelets doing workouts in self-Quarantine
విరామంలోనూ కసరత్తులకు సై అంటున్న ఆటగాళ్లు
author img

By

Published : Mar 23, 2020, 8:41 AM IST

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మామూలుగానే ఫిట్‌నెస్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే ఆటగాడు. సిరీస్‌ల మధ్య ఖాళీ దొరికినా అతను కసరత్తులు మానడు. ఇప్పుడు కరోనా కారణంగా టీమ్‌ఇండియా ఆడాల్సిన అంతర్జాతీయ సిరీస్‌ రద్దయింది. ఐపీఎల్‌ వాయిదా పడింది. దీంతో బయటి ప్రపంచానికి దూరంగా భార్య అనుష్క శర్మతో కలిసి స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయాడు కోహ్లీ. ఈ ఖాళీ సమయంలో ఆటకు దూరమైనా కసరత్తులకు మాత్రం అతను దూరం కాలేదు. రోజూ కేటాయించే సమయానికి మించి అతను జిమ్‌లో కష్టపడుతున్నాడు. ఆట మళ్లీ ఎప్పుడు మొదలైనా.. శారీరకంగా పూర్తి సన్నద్ధతతో ఉండాలన్న లక్ష్యంతో అతను కష్టపడుతున్నట్లు తెలిసింది. ఇక విరామం లేకుండా సిరీస్‌లు ఆడి అలసిపోయిన మిగతా టీమిండియా క్రికెటర్లు కొంత కాలం విశ్రాంతి తీసుకుని.. తర్వాత ఫిట్‌నెస్‌ మీద దృష్టిసారించబోతున్నారు. ఈ విషయంలో జట్టు యాజమాన్యం నుంచి ఆటగాళ్లకు సూచనలు వెళ్లినట్లు సమాచారం.

క్రికెటర్లు మాత్రమే కాదు.. ఇతర క్రీడాకారులందరూ కూడా ఫిట్‌నెస్‌ విషయంలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒలింపిక్స్‌ ముంగిట టోర్నీలు రద్దవడం, వాయిదా పడటం క్రీడాకారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాక ఆటగాళ్లపై ఒత్తిడి రెట్టింపవడం ఖాయం. అత్యవసరంగా అర్హత టోర్నీల్లో పోటీ పడాల్సి రావచ్చు. ఒలింపిక్స్‌ సన్నద్ధతలో భాగంగా తక్కువ సమయంలో ఎక్కువ కష్టపడాల్సి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఇంటిపట్టునే కసరత్తులు చేస్తూ ఫిట్‌నెస్‌ పెంచుకునే ప్రయత్నంలో పడ్డారందరూ. మానసిక దృఢత్వం కోసం యోగా మీద దృష్టిసారిస్తున్నారు.

"ఈ ఖాళీ సమయాన్ని ఫిట్‌నెస్‌ మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకుంటున్నా. మామూలు రోజుల్లో కంటే ఎక్కువ కసరత్తులు చేస్తున్నా."

- మేరీకోమ్‌, బాక్సర్​

15 ఏళ్లుగా బ్యాడ్మింటన్‌ సాధన చేస్తూ వచ్చిన నేను.. ఇలా ఖాళీగా ఉండటం ఇదే తొలిసారి. అయితే ఈ సమయంలో ఇంటి దగ్గరే కసరత్తులు చేస్తూ ఫిట్‌నెస్‌ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా. ఒలింపిక్స్‌ ఎప్పుడు జరిగినా సిద్ధమే.

- పీవీ సింధు, భారత షట్లర్​

మనమేంటో ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇది సరైన సమయం. కెరీర్లో ఏ దశలో ఉన్నామో ఇప్పుడు ఆలోచించాలి. అలాగే శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి.

- కీరన్‌ పొలార్డ్‌, వెస్టిండీస్​ క్రికెటర్​

ఈ రోజుల్లో ఫిట్‌నెస్‌ ఎంతో కీలకం. ఈ ఖాళీ సమయంలో శారీరక దృఢత్వం పెంచుకుంటున్నా. రాకెట్‌ డ్రిల్స్‌, వేళ్ల బలాన్ని పెంచే కసరత్తులు చేస్తున్నా.

- అశ్విని పొన్నప్ప, భారత షట్లర్​

ఇదీ చూడండి.. "కోహ్లీలా అన్ని సార్లు టాప్​లో ఉండటం కష్టమే"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.