ETV Bharat / sports

రెజ్లర్​ రవి దహియాకు గోల్డ్​.. పునియాకు సిల్వర్​ - రవి కుమార్​ దహియా గోల్డ్​

Asian championship wrestling 2022: ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్స్ రజత పతక విజేత, భారత కుస్తీవీరుడు రవికుమార్‌ దహియా సత్తా చాటాడు. రెజ్లింగ్‌ 57 కిలోల పురుషుల ఫ్రీస్టైల్ విభాగంలో దహియా స్వర్ణ పతకం సాధించాడు. మరోవైపు.. 67 కేజీల విభాగంలో రజతం సాధించాడు బజరంగ్​ పునియా.

Asian Championship gold medals
ఆసియా రెజ్లింగ్​లో దహియా హ్యాట్రిక్​ గోల్డ్
author img

By

Published : Apr 23, 2022, 5:26 PM IST

Asian championship wrestling 2022: ఆసియా రెజ్లింగ్​ ఛాంపియన్​షిప్​లో ఒలింపిక్స్​ రజత పతక విజేత, భారత కుస్తీవీరుడు రవికుమార్​ దహియా సత్తా చాటాడు. రెజ్లింగ్​ 57 కిలోల పురుషుల ఫ్రీస్టైల్​ విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. దీంతో వరుసగా మూడోసారి గోల్డ్​మెడల్​ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. శనివారం జరిగిన తుది పోరులో కజకిస్థాన్​కు చెందిన కల్జాన్​ రఖత్​ను దహియా 12-2 తేడాతో మట్టికరిపించాడు.

Asian Championship gold medals
రవి కుమార్​ దహియా

ఈ సీజన్​లో రవి దహియాకు ఇది రెండో ఫైనల్​ మ్యాచ్​. గత ఫిబ్రవరిలో జరిగిన డాన్​కొలోవ్​ పోటీల్లో రజతం సాధించాడు. సోనెపట్​లోని నహ్రీ గ్రామానికి చెందిన రవి.. మరోమారు తన బలాన్ని, వ్యూహాత్మకతను ప్రదర్శించాడు. అంతకుముందు 2020లో దిల్లీ, 2021లో అల్మాటిలో జరిగిన ఆసియా రెజ్లింగ్​ ఛాంపియన్​షిప్​ పోటీల్లో స్వర్ణం సాధించాడు.

బజరంగ్​ పూనియాకు రజతం: ఆసియా రెజ్లింగ్​ ఛాంపియన్​షిప్​లో భారతకు చెందిన మరో రెజ్లర్​ బజరంగ్​ పునియా రజతం సాధించాడు. 65 కేజీల కేటగిరీలో ఇరాన్​కు చెందిన రెహ్మాన్​ మౌసాతో జరిగిన తుది పోరులో 1-3తో ఓటమి పాలయ్యాడు. మరోవైపు.. 70 కేజీల విభాగంలో మగోలియా రెజ్లర్​ను ఓడించి కాంస్య పతకాన్ని సాధించాడు కుస్తీవీరుడు నవీన్​. శుక్రవారం జరిగిన ఈవెంట్లలో అన్షుమాలిక్​(57 కేజీలు), రాధిక(65 కేజీలు) చెరో రజత పతకంతో మెరిశారు.

Asian Championship gold medals
బజరంగ్​ పూనియా

ఇదీ చూడండి: రజతాలతో మెరిసిన అన్షు, రాధిక.. మనీషకు కాంస్యం

Umran Malik: అతడి వేగానికి.. పేదరికం క్లీన్‌బౌల్డ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.