ETV Bharat / sports

సాత్విక్​- చిరాగ్ అదరహో.. 52 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆసియా బ్యాడ్మింటన్‌లో గోల్డ్​ మెడల్​ - ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్​ 2023 డబుల్స్​

దాాదాపు యాభై రెండేళ్ల నిరీక్షణకు తెర దించుతూ ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో స్వర్ణ పతకాన్ని అందించింది సాత్విక్-చిరాగ్ జోడీ.​ ఆ వివరాలు..

asia-badminton-championship-2023
asia-badminton-championship-2023
author img

By

Published : May 1, 2023, 6:51 AM IST

Updated : May 1, 2023, 7:24 AM IST

ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. తెలుగు తేజం రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజు.. చిరాగ్‌ శెట్టితో కలిసి డబుల్స్‌లో జయకేతనం ఎగురవేశారు. ఈ విజయంతో బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్టార్లు సాత్విక్‌ సాయిరాజు, చిరాగ్‌ శెట్టి తమ కెరీర్లో అత్యుత్తమ విజయాన్ని అందుకున్నారు. ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్లుగా నిలిచిందీ జోడి. సాత్విక్‌-చిరాగ్‌ జోడీ ఆదివారం మలేసియాకు చెందిన ఆంగ్‌ యెవ్‌ సిన్‌-టియో యీలతో పోటీ పడింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ 16-21, 21-17, 21-19తో ఆంగ్‌ యెవ్‌ సిన్‌-టియో యీ (మలేసియా)పై విజయం సాధించారు.

అయితే తొలి సెట్​లో ఓడినప్పటికీ నిరాశ చెందకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లారు. ఈ జోడీ ఎక్కడా డీలా పడకుండా గొప్పగా పోరాడి టైటిల్‌ సాధించిన తీరు అద్భుతం. ఆరంభంలో స్కోర్లు 4-4, 7-7, 13-13 ఇలా సమమవుతూ.. మ్యాచ్ ఆసక్తిగా మారింది. చివర్లో ధాటిగా ఆడిన మలేసియన్ జోడీ స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లింది. భారత్​ జోడీ.. సాత్విక్‌-చిరాగ్‌ రెండో గేమ్‌లో చాలా వరకు వెనుకబడే ఉన్నారు. ఇక అందరూ ఈ సారీ టైటిల్‌ చేజారేట్లేనా అంటూ ఆందోళన చెందారు. ఒక దశలో భారత జోడీ 7-13తో వెనుకబడింది.

ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం

కానీ ఈ దశలో గొప్పగా పుంజుకున్న ఈ ద్వయం.. 14-14తో స్కోరు సమం చేసింది. తర్వాత ఆధిక్యం సంపాదించి స్కోరు సమం చేసింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో రెండు జోడీలూ హోరాహోరీగా తలపడ్డాయి. ఒక దశలో ఆంగ్‌-టియో 15-10తో ఆధిక్యంలో నిలవడంతో మ్యాచ్‌ భారత జోడీకి దూరమవుతుందా అని సందేహం కలిగింది. కానీ రెండో గేమ్‌లో మాదిరే సాత్విక్‌- చిరాగ్‌ ఒత్తిడిలో అద్భుత ప్రదర్శనతో గేమ్‌తో పాటు టైటిల్‌నూ ఎగరేసుకుపోయారు. ఆసియా బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌లో 1971లో దీపు ఘోష్‌-రామన్‌ ఘోష్‌ కాంస్యం గెలవడమే ఇప్పటిదాకా భారత్‌కు ఉత్తమ ప్రదర్శన.

2022 కామన్వెల్త్‌ గేమ్స్‌ స్వర్ణంతో పాటు బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌లో అయిదు టైటిళ్లు గెలిచిన సాత్విక్‌ జోడీకి.. కెరీర్లో ఇది మరో మేటి విజయం. ఈ ఏడాది వీళ్లిద్దరూ స్విస్‌ ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్‌ సాధించిన సంగతి తెలిసిందే. 22 ఏళ్ల సాత్విక్‌ స్వస్థలం ఆంధప్రదేశ్‌లోని అమలాపురం కాగా.. 25 ఏళ్ల చిరాగ్‌ ముంబయికి చెందిన ఆటగాడు.

Last Updated : May 1, 2023, 7:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.