ETV Bharat / sports

చరిత్ర సృష్టించిన అర్జాన్ భల్లార్ - వన్ హెవీ వెయిట్ ఛాంపియన్​గా అర్జాన్ భల్లార్

మిక్స్​డ్ మార్షల్ ఆర్ట్స్​లో భారత సంతతి ఆటగాడు అర్జాన్ భల్లార్ విజేతగా నిలిచాడు. వన్​ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్​గా నిలిచి చరిత్ర సృష్టించాడు.

Arjan Bhullar
అర్జాన్ భల్లార్
author img

By

Published : May 17, 2021, 1:06 PM IST

మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (ఎమ్‌ఎమ్‌ఏ)లో భారత సంతతి ఆటగాడు అర్జాన్‌ భల్లార్ సంచలనం సృష్టించాడు. ఈ టోర్నీలో వరల్డ్‌ హెవీ వెయిట్‌ చాంపియన్‌గా నిలిచాడు. తద్వారా ఈ టైటిల్ నెగ్గిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర నెలకొల్పాడు.

ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్​ బెండ్రన్ వెరాను మట్టికరిపించాడు అర్జాన్. సింగపూర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఈ పోటీలో బౌట్ మొత్తం భల్లార్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఇతడు 2010 కామన్​వెల్త్ పోటీల్లో కెనడా తరఫు స్వర్ణ పతకం సాధించి గుర్తింపు పొందాడు.

మహిళల విభాగంలో భారత స్టార్ రెజ్లర్​ రీతూ ఫోగట్ పోరు ముగిసింది. ఆమె అమెరికాకు చెందిన బీ గుయెన్ చేతులో ఓటమిపాలైంది. ఎమ్​ఎమ్​ఏ కెరీర్​లో ఫోగట్​కు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. ఓటమిని ఒప్పుకొంటూ.. తదుపరి బౌట్​లో మళ్లీ పుంజుకుంటానని ఆశాభావం వ్యక్తం చేసింది రీతు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.