ETV Bharat / sports

భారత స్టార్​ ఆర్చర్ల 'ప్రేమ బాణం' - రాంచిలో అతాను దాస్​, దీపికా కుమారి పెళ్లి

విలువిద్య క్రీడాకారులు దీపికా కుమారి, అతాను దాస్.. ఈనెల 30న వివాహం చేసుకోనున్నారు. కరోనా ప్రభావంతో ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా జరుపుకోవాలని నిశ్చయించుకున్నారు.

archer Deepika and Atanu Das will marry
దీపికా కుమారి, అతాను దాస్​
author img

By

Published : Jun 11, 2020, 1:18 PM IST

భారత ప్రముఖ ఆర్చర్లు దీపికా కుమారి, అతాను దాస్‌ 'ప్రేమ బాణం' లక్ష్యాన్ని చేరనుంది. ఈ ఏడాది జూన్​ 30న వీరిద్దరి పెళ్లి చేసుకోనున్నారు. ఝార్ఖండ్​ రాంచీలోని దొరండా గ్రామంలో ఓ అతిథి గృహంలో వీరి వివాహం జరగనుంది.​ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొద్దిమంది ఆత్మీయలు మాత్రమే ఈ వేడుకకు హాజరు కానున్నారు.

వీరిద్దరికి 2018 డిసెంబరులో నిశ్చితార్థం జరిగింది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పనులు చకచక జరిగిపోతున్నాయి. దీపిక తరఫున 50, అతాను దాస్​ 10 మంది మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు సమాచారం.

వీరిద్దరూ, ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్​ మిక్సడ్​ ఆర్చరీ విభాగంలో అర్హత సాధించారు. టోర్నీ వచ్చే ఏడాదికి వాయిదా పడిన నేపథ్యంలో, తమ పెళ్లి జరిగిన తర్వాత కూడా ప్రాక్టీసుపై దృష్టి పెడతామని అన్నారు.

ఇది చూడండి : 'ఐఓఏ అధ్యక్షుడు ఉల్లంఘనలకు పాల్పడ్డారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.