ప్రముఖ బాస్కెట్‌బాల్ ఆటగాడు కోబ్ బ్రాయంట్ మరణవార్త విని యావత్ క్రీడాభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆదివారం కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజెల్స్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో కోబ్, ఆయన కుమార్తె జియానా(13)తో సహా 9 మంది మృతి చెందారు. అయితే కోబ్ మరణవార్తను ఓ నెటిజన్ 2012లోనే ఊహించాడు. ఏడేళ్ల కింద చేసిన ఆ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. 'నోసో' అనే వ్యక్తి.. బ్రాయంట్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణిస్తాడని 2012 నవంబర్ 14న ట్వీట్ చేశాడు. ఇది చూసిన అతడి ఫాలోవర్లు నోసోపై మండిపడ్డారు.
అయితే, ఆ నెటిజన్ చెప్పినట్లుగానే కోబ్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించాడు. ఈ కారణంగా సోమవారం ఆ నెటిజన్ ఏడేళ్ల నాటి తన ట్వీట్‌కు క్షమాపణలు చెప్పాడు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం సుమారు 9 గంటలకు కోబ్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లాస్‌ఏంజెల్స్‌లోని పశ్చిమాన ఓ కొండను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న వారంతా మృతిచెందారు. కోబ్ మృతిపై ప్రముఖులతో పాటు అతడి అభిమానులు పెద్ద ఎత్తున సంతాపం తెలుపుతున్నారు.
ఇవీ చూడండి.. బ్రాయాంట్ మృతి: ట్రంప్, ఒబామా, కోహ్లీ, రొనాల్డో నివాళి