ETV Bharat / sports

వీరు రింగ్​లోకి దిగితే పంచ్​ పడుద్ది!

ఒకరు ముగ్గురు పిల్లల తల్లి.. కెరీర్‌లో దాదాపుగా సాధించని టైటిల్‌ అంటూ లేదు.. అయినా ఆమెలోని ఛాంపియన్‌ ఊరుకోలేదు.. యువ క్రీడాకారిణులతో కలిసి సై అంది..! ఇంకో అమ్మాయి భివాని నుంచి వచ్చి సంచలనాలు సృష్టిస్తుంది! మరో అమ్మాయి బాక్సింగ్‌ అంటేనే ఏవగించుకుని ఇప్పుడు అదే ఆటలో సత్తా చాటుతోంది..! ఇంకో బాక్సర్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నుంచి వచ్చి పదునైన పంచ్‌లు విసురుతోంది! వీళ్లే తాజాగా ప్రపంచ మహిళల బాక్సింగ్‌లో పతకాలు సాధించిన మన భారత నారీభేరీలు మేరీకోమ్‌, సోనియా, సిమ్రన్‌జీత్‌ కౌర్‌, లవ్లినా!

A story on best indian boxers
వీరు రింగ్​లోకి దిగితే పంచ్​ పడుద్ది!
author img

By

Published : Mar 8, 2020, 7:30 PM IST

వయసు మీద పడింది.. ముగ్గురు పిల్లల తల్లి ఇక ఆమె పనైపోయిందన్నారు.. చిన్న టోర్నీల్లోనూ.. పేరు లేని ప్రత్యర్థుల చేతుల్లోనూ ఓడిపోతుంటే మళ్లీ రాణించడం కష్టమన్నారు.. ఈ విమర్శలేవీ ఆమెను ఆపలేకపోయాయి.. మళ్లీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటకుండా అడ్డుకోలేకపోయాయి.. ఆ పేరుకు పరిచయం అక్కర్లేదు.. మేరీకోమ్‌! ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ అయిన ఈ మణిపురి తార ఎనిమిదేళ్ల విరామం తర్వాత మరోసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటింది.

2016 రియో ఒలింపిక్స్‌కు ఎంపిక కాలేకపోవడం వల్ల ఇక మేరీ కథ ముగిసినట్లే అని అంతా అనుకున్నారు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచి చరిత్ర సృష్టించిన తర్వాత ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవాలని మేరీ తపించింది. కానీ ఆ తర్వాత మేరీకి ఏదీ కలిసి రాలేదు. తనకు కలిసొచ్చిన 48 కిలోల విభాగం నుంచి 51 కిలోలకు మారాల్సి వచ్చింది. ఆరంభంలో తనకన్నా జూనియర్ల చేతిలో కూడా ఓడింది. అయితే వియత్నాంలో జరిగిన ఆసియా మహిళల ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడం మేరీలో మళ్లీ ఉత్సాహాన్ని నింపింది. ఆ ఉత్సాహంతోనే కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారి పసిడి పతకాన్ని అందుకుంది. తాజాగా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మేరీది అదే జోరు. పెద్దగా శ్రమించకుండానే ఫైనల్‌ చేరిందామె. అంతేకాదు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఏడు పతకాలు సాధించిన తొలి బాక్సర్‌గా మరో ఘనత సాధించింది. ఇప్పుడు మేరీ లక్ష్యం ఒలింపిక్స్‌ స్వర్ణం. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి ఆటకు వీడ్కోలు చెప్పాలని ఈ దిగ్గజం భావిస్తోంది.

A story on best indian boxers
మేరీకోమ్​

భివాని బాంబర్‌

భివాని.. ఈ పేరు చెబితే చాలు భారత బాక్సింగ్‌లో స్టార్‌ ఆటగాళ్లుగా పేరొందిన విజేందర్‌సింగ్‌, అఖిల్‌ కుమార్‌, జితేందర్‌ సింగ్‌ లాంటి వాళ్లు గుర్తొస్తారు. అలాంటి చోట నుంచి వచ్చి మహిళల బాక్సింగ్‌లో తనదైన ముద్ర వేస్తోంది 21 ఏళ్ల సోనియా. చూడటానికి అబ్బాయిలా కనిపించే ఈ హరియాణా అమ్మాయి రింగ్‌లో దిగితే ప్రత్యర్థికి చెమటలు పట్టిస్తుంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన సోనియా అనుకోకుండా బాక్సింగ్‌లోకి వచ్చింది. పాఠశాలలో పీఈటీ ప్రోద్బలం.. మాజీ ప్రపంచ కాంస్య పతక విజేత కవిత చాహల్‌ స్ఫూర్తితో సోనియా గ్లవ్స్‌ తొడిగింది. తాను ఆరాధించే కవిత చాహల్‌ని ఒక బౌట్లో సోనియా నాకౌట్‌ చేయడం విశేషం! సోనియా ఉత్సాహం చూసి ఆమె తల్లిదండ్రులు భివాని బాక్సింగ్‌ క్లబ్‌లో కోచ్‌ జగదీశ్‌ సింగ్‌ దగ్గరకు తీసుకెళ్లారు. భివాని క్లబ్‌లో మరింత రాటుదేలిన సోనియా... ఆ తర్వాత మరిన్ని సంచలన విజయాలు సాధించింది.

తొలి ప్రయత్నంలోనే..

అహ్‌మెట్‌ కామ్రెట్‌ టోర్నీలో 2017లో ప్రపంచ యూత్‌ ఛాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత పిలావో బాసుమత్రెను కంగుతినిపించింది. అదే క్రమంలో ఆమె ఆ టోర్నీలో కాంస్య పతకం సొంతం చేసుకుంది. పొడగరి కావడం కూడా రింగ్‌లో సోనియా ఆధిపత్యం చెలాయించేందుకు ఒక కారణమైంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తనకన్నా సీనియర్లపై అనూహ్య విజయాలు నమోదు చేసిన సోనియా.. తొలి ప్రయత్నంలోనే ఫైనల్‌కు దూసుకెళ్లింది.

"నాన్న వ్యవసాయం చేస్తారు. అమ్మ గృహిణి. ఇంట్లో ఎవరూ బాక్సర్లు లేరు. కానీ నేను బాక్సర్‌ కావాలనుకున్నా. జాతీయ ఛాంపియన్‌ నీతూతో పాటు కవిత చాహల్‌ ఎంతో సాయం చేశారు. భివాని క్లబ్‌ కోచ్‌ జగదీశ్‌ సార్‌ వల్లే ఈ స్థాయిలో ఉన్నా" -సోనియా .

A story on best indian boxers
సోనియా

బాక్సింగ్‌ వద్దన్న అమ్మాయే..

ఇంట్లో అప్పటికే ముగ్గురు బాక్సర్లు ఉన్నారు.. ఆ అమ్మాయిని కూడా బాక్సర్‌ చేయాలని అనుకున్నారు ఆమె తల్లిదండ్రులు. రక్తం వచ్చేలా కొట్టుకునే ఆ ఆటంటే ఆమెకు ఇష్టం లేదు. తను బాక్సర్‌ను కానంటే కానని చెప్పింది. కానీ కోచ్‌ ఇచ్చిన స్ఫూర్తితో ఆమె బాక్సర్‌ అయింది. అప్పుడు బాక్సింగ్‌ వద్దన్న సిమ్రన్‌జీత్‌ కౌరే ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలిచింది.

తండ్రే తొలి కోచ్​

సిమ్రన్‌ది పంజాబ్‌లోని లూధియానా. ఆమె ఇంట్లో ముగ్గురు సోదరులు బాక్సర్లే. సిమ్రన్‌ బాక్సర్‌ కావడం వెనుక ఆమె తండ్రి రాజ్యపాల్‌ది కీలకపాత్ర. తన కుమారులు జాతీయ స్థాయి బాక్సర్లు కాలేకపోయారని.. సిమ్రన్‌నైనా ఆ స్థాయికి తీసుకెళ్లాలని ఆయనెంతో కష్టపడ్డాడు. స్వతహాగా కబడ్డీ ఆటగాడు అయినా... సిమ్రన్‌ కోసం తాను బాక్సింగ్‌ గ్లోవ్‌లు ధరించి ప్రాక్టీస్‌ చేయించేవాడు. ఆరుగురు ఉండే ఆ ఇంట్లో పూట గడవడమే కష్టంగా ఉన్నా.. రాజ్యపాల్‌ మాత్రం కౌర్‌ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవాడు. ఆమెకు అవసరమైన పౌష్టికాహారాన్ని ఎలాగోలా ఏర్పాటు చేసేవాడు. చిన్న చిన్న టోర్నీల్లో పతకాలు గెలిచినా 2014లో హరిద్వార్‌లో జరిగిన జాతీయ సీనియర్‌ పోటీల్లో స్వర్ణం గెలవడం సిమ్రన్‌ కెరీర్‌లో మలుపు. టర్కీలో జరిగిన అహ్‌మెట్‌ కామ్రెట్‌ టోర్నీలో స్వర్ణం గెలిచి అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది ఈ పంజాబీ అమ్మాయి. ఆరంభం నుంచి అండగా నిలిచిన ఆమె తండ్రి ఈ ఏడాది జులైలో మరణించడం వల్ల సిమ్రన్‌ కోలుకోలేకపోయింది. కానీ మళ్లీ బాక్సింగ్‌ రింగే కౌర్‌కు ఊరటనిచ్చింది. తండ్రి కోసం ప్రపంచ బాక్సింగ్‌లో పతకం తేవాలని ఆమె కల కంది. భారత బాక్సింగ్‌ జట్టుకు విదేశీ కోచ్‌గా వచ్చిన బిల్లీ వాల్ష్‌.. సిమ్రన్‌లో ఉన్న పవర్‌ను గుర్తించాడు. రింగ్‌లో మెరుపులా కదిలే సిమ్రన్‌.. ప్రత్యర్థిపై దాడి చేసే తీరు.. ఎదురుదాడికి దిగే విధానం, పంచ్‌ విసిరే వైనం ఆయన్ని ఆకర్షించాయి. సిమ్రన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి శిక్షణ ఇచ్చాడు. ఇది సత్ఫలితాన్ని ఇచ్చి ప్రపంచ బాక్సింగ్‌ టోర్నీలో సిమ్రన్‌కు పతకాన్ని సాధించిపెట్టింది.

A story on best indian boxers
సిమ్రన్‌జీత్‌

మార్షల్‌ ఆర్ట్స్‌ బాక్సర్‌..

లవ్లినా బోర్గాయిన్‌.. ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పతకం ఖరారు చేసిన బాక్సర్‌. అసోంలోని గోలాఘాట్‌ జిల్లాకు చెందిన లవ్లినా మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చింది. తన సోదరిలు లిచా, లిమా మౌతాయ్‌ బాక్సింగ్‌, మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవడం వల్ల వారి బాటలోనే తాను కూడా మొదట మార్షల్‌ ఆర్ట్స్‌లోకి వచ్చింది లవ్లినా. అయితే పాఠశాల ఉపాధ్యాయుడి సూచన మేరకు 15 ఏళ్ల వయసులో మార్షల్‌ ఆర్ట్స్‌ నుంచి బాక్సింగ్‌కు మళ్లింది. మౌతాయ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో తీసుకున్న శిక్షణ బాక్సింగ్‌లో లవ్లినాకు బాగా ఉపయోగపడింది. ప్రత్యర్థి నుంచి తప్పించుకోవడంలో, ఒడుపుగా పంచ్‌లు విసరడంలో ఆమె ఆరితేరింది. 2012 జాతీయ సబ్‌ జూనియర్‌ బాక్సింగ్‌లో స్వర్ణంతో మొదలుపెట్టిన లవ్లినా ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.

డిగ్రీ చదువుతూ..

నాన్న చిన్న వ్యాపారి అవడ వల్ల లవ్లినా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడింది. బాక్సింగ్‌లో కొనసాగడం కష్టమైంది. కానీ షిల్లాంగ్‌ క్రీడా ప్రాధికార సంస్థ అండతో నిలబడింది. 2015 వరకు యూత్‌ స్థాయిలో పోటీపడిన లవ్లినా.. గతేడాది సీనియర్‌ విభాగంలో పోటీపడి ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచింది. ఒకవైపు దూరవిద్యలో డిగ్రీ చదువుతూనే బాక్సింగ్‌ను కొనసాగించింది లవ్లినా. గతేడాది ప్రెసిడెంట్స్‌ కప్‌లో కాంస్యం గెలిచిన ఈ అసోం అమ్మాయి.. కామన్వెల్త్‌ క్రీడల్లోనూ పోటీపడింది.

A story on best indian boxers
లవ్లీనా

ఇదీ చూడండి: హర్మన్ ప్రీత్..​ భారత మహిళా క్రికెట్లో ఆడపులి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.