ETV Bharat / sports

ఉమెన్స్ డే: కిడ్నీలో రాళ్లు.. మెడలో స్వర్ణాలు - A special story on gymnast Simone Biles

మరో 24 గంటల్లో ప్రపంచ జిమ్నాస్టిక్స్‌ ఛాంపియన్‌షిప్‌..! అగ్రశ్రేణి జిమ్నాస్ట్‌లంతా పతకం కోసం కఠోరంగా సాధన చేస్తుంటే.. ఓ అమ్మాయి మాత్రం భరించలేని కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు కిడ్నీలో రాళ్లున్నాయని శస్త్రచికిత్స అవసరమని స్పష్టం చేశారు. కానీ ఆమె ధ్యాసంతా మరుసటి ఉదయం జరిగే ఆలరౌండ్ క్వాలిఫయర్‌పైనే! డోపింగ్‌ నిబంధనల కారణంగా కనీసం నొప్పి నివారణ మందులు వేసుకోవడానికి వీల్లేదు. ఇలాంటి స్థితిలో పోటీకి సిద్ధమైన ఆమె కనీసం పోటీ అయినా ఇస్తుందా అన్న అనుమానం అందరిలోనూ.. అయితే ఆమె ప్రదర్శనతో అందరి అనుమానాలను పటాపంచలు చేసింది. ఆమె మరెవరో కాదు.. అమెరికా జిమ్నాస్ట్‌ సైమన్‌ బైల్స్‌.

A special story on gymnast Simone Biles
కిడ్నీలో రాళ్లు.. మెడలో స్వర్ణాలు
author img

By

Published : Mar 8, 2020, 5:31 PM IST

క్రికెట్‌ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సచిన్‌ తెందుల్కర్‌.. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో రారాజు ఎవరంటే..? వినిపించే సమాధానం ఉసేన్‌ బోల్ట్‌.. టెన్నిస్‌లో ఫెదరర్‌, నాదల్‌.. ఫుట్‌బాల్‌లో మెస్సి, రొనాల్డో.. ఇలా ఎంతోమంది దిగ్గజాలు. వీళ్లందరూ ఆట వల్ల పేరు తెచ్చుకోవడం మాత్రమే కాదు ఆ ఆటకే అందాన్ని తీసుకొచ్చారు. ఆదరణ పెంచారు. ఇప్పుడు వీరి సరసన సైమన్‌ బైల్స్ పేరూ చేరే సమయం వచ్చింది.

బైల్స్‌ విన్యాసం..

సైమన్‌కు ముందు జిమ్నాస్టిక్స్‌లో గొప్పవాళ్లు లేరు అనికాదు. కానీ 4 అడుగుల 8 అంగుళాల పొడుగున్న సైమన్‌లా ఆధిపత్యం ప్రదర్శించిన వాళ్లెవరూ లేరు. ఫ్లోర్‌ విభాగంలో అయితే ఏకంగా తన పేరు మీద ఓ విన్యాసాన్నే ప్రకటించేలా చేసింది. వేగంగా పరుగెత్తి రెండు చేతులు కింద పెట్టి ఒక్కసారిగా పైకెగిరి గాల్లో రెండు రౌండ్లు కొట్టి... ఆ తర్వాత శరీరాన్ని ఓ వైపు సగం తిప్పి మళ్లీ ఇంకో రౌండ్‌ కొట్టి నేల మీద దిగడం... ఇది బైల్స్‌ జిమ్నాస్టిక్స్‌ ప్రపంచానికి పరిచయం చేసిన విన్యాసం. కేవలం ఆమెకు మాత్రమే సొంతమైన విన్యాసం. దాంతో ఆ విన్యాసానికి 'ది బైల్స్‌' అని పేరు పెట్టేశారు. వాల్ట్‌లోనూ ఆమె చేసే విన్యాసాలు ఇంకెవరికీ సాధ్యం కావేమో!

ఎనిమిదేళ్ల వయసులోనే..!

శరీరాన్ని విల్లులా వంచుతూ.. చిత్రవిచిత్రమైన విన్యాసాలను సులువుగా ప్రదర్శిస్తూ పతకాల పంట పండిస్తోన్న సైమన్‌కు చిన్నప్పటి నుంచే జిమ్నాస్టిక్స్‌ అంటే ఆసక్తి. సహజసిద్ధంగా ఆమె బలంగా ఉండడం వల్ల.. ఎటైనా వంచేలా శరీరం సహకరించిన కారణంగా ఆరేళ్ల వయసులోనే ఇంట్లో సొంతంగా, ఎవరి సాయం లేకుండా ముందుకు, వెనక్కు పల్టీలు కొట్టేది. ఎనిమిదేళ్ల వయసులో పూర్తిగా జిమ్నాస్టిక్స్‌ శిక్షణ తీసుకోవడం ఆరంభించిన సైమన్‌ అంచెలంచెలుగా ఎదిగి జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌ల్లో ప్రకంపనలు సృష్టించింది. అయితే సైమన్‌కు జిమ్నాస్టిక్స్‌ మీద పట్టు అంత సులభంగా రాలేదు.

పడిపడి.. లేచి

2011లో తొలిసారి అమెరికా క్లాసిక్‌ టోర్నీలో పోటీపడ్డ సైమన్.. వాల్ట్‌, బ్యాలన్స్‌ బీమ్‌, ఫ్లోర్‌ ఎక్స్‌ర్‌సైజ్‌లో రాణించినా పతకం గెలిచే స్థాయిని అందుకోలేకపోయింది. దాంతో శిక్షణకు తగినంత సమయం దొరకట్లేదని పాఠశాలకు వెళ్లడం మానేసింది. అప్పటి వరకు వారానికి 20 గంటల పాటు సాధన చేసే ఆమె ఆ తర్వాత ఆ సమయాన్ని 32 గంటలకు పెంచింది. ఆ తర్వాతి ఏడాది క్లాసిక్‌ టోర్నీలో జూనియర్‌ ఛాంపియన్‌గా నిలిచి జాతీయ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడే అవకాశాన్ని దక్కించుకుంది. 2013లో సీనియర్‌ జట్టు తరపున పోటీపడే అవకాశం వచ్చింది. కానీ తొలిసారి సీనియర్‌ స్థాయి టోర్నీ కావడం వల్ల తీవ్ర ఒత్తిడిలో బీమ్‌పై నుంచి పడి పతకం పోగొట్టుకుంది. దాంతో ఆమె కోచ్‌ తనను సీనియర్‌ విభాగం నుంచి తప్పిద్దామనుకున్నాడు. దీంతో బైల్స్‌ తీవ్ర నిరాశకు గురైంది. పడిన ప్రతిసారి రెట్టింపు వేగంతో దూసుకొచ్చే సైమన్‌ మరింత పట్టుదలగా సాధన చేసింది. విమర్శలు చేసిన వాళ్ల నోళ్లు మూయించేలా అదే ఏడాది జాతీయ ఛాంపియన్‌షిప్‌ సీనియర్‌ విభాగంలో అన్ని పతకాలు సొంతం చేసుకుని సత్తాచాటింది.

ఆల్​రౌండ్​ స్వర్ణాలతో అదరహో

పదహారేళ్ల వయసులోనే ప్రపంచ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో బరిలో దిగి నాలుగు విభాగాల్లో ఫైనల్‌ చేరి.. ఆల్‌రౌండ్‌ స్వర్ణంతో ఔరా అనిపించింది. 1991 తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడిన అన్ని విభాగాల్లో ఫైనల్‌ చేరిన మొదటి అమెరికా జిమ్నాస్ట్‌గా నిలిచింది. అప్పటి నుంచే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమె ఆధిపత్యం మొదలైంది. ఆ తర్వాత వరుసగా 2014, 15 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల్లో నాలుగేసి స్వర్ణాలు గెలుచుకుంది. రియో ఒలింపిక్స్‌లోనూ నాలుగు పసిడి పతకాలతో సత్తాచాటింది. పోటీపడ్డ తొలి ఒలింపిక్స్‌లోనే నాలుగు బంగారు పతకాలతో దిగ్గజాల సరసన చోటు సాధించింది.

A special story on gymnast Simone Biles
జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌

హద్దులు చెరిపేస్తూ..

గతంలో జిమ్నాస్టిక్స్‌లో 10 పాయింట్ల విధానం ఉండేది. అవి సాధించిన వాళ్లు విజేతలుగా నిలిచేవాళ్లు. అయితే 2006లో ఆ పద్ధతిని తొలగించారు. దాంతో ఏ విభాగంలోనైనా ఎక్కువ పాయింట్లు సాధించిన వాళ్లను ఛాంపియన్‌లుగా ప్రకటించేవాళ్లు. ఒక్కసారి సైమన్‌ అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్‌లో అడుగుపెట్టిన తర్వాత ఆ స్కోరు హద్దులను చెరిపేసింది. ఒక్కో టోర్నీలో ఒక్కో అత్యధిక స్కోరు నమోదు చేస్తూ దూసుకెళ్తోంది. ఆల్‌రౌండ్‌, వాల్ట్‌, బీమ్‌, ఫ్లోర్‌ ఇలా ఏ విభాగం అయినా కూడా అత్యధిక స్కోరు తన పేరు మీద ఉండాల్సిందే.

రికార్డుల రాణి

రెండేళ్ల విరామం తర్వాత జాతీయ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన బైల్స్‌కు కిడ్నీలో రాళ్ల సమస్య అడ్డంకిగా మారింది. అయినా వెరవకుండా టోర్నీలో పోటీ పడ్డ ఆరు విభాగాల్లో పతకాలు సాధించిన సైమన్‌ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 14 స్వర్ణాలు గెలిచిన ఏకైక జిమ్నాస్ట్‌ (మహిళలు/పురుషులు) సైమన్‌. అంతేకాకుండా ఈ మెగా టోర్నీలో మరో పతకం సాధిస్తే 21 పతకాలతో ఆల్‌టైమ్‌ అగ్రశ్రేణి క్రీడాకారిణిగా నిలిచే అవకాశం ఉంది. 1987లో ఎలీనా షుషునోవా (రష్యా) తర్వాత ఆరు విభాగాల్లో పతకాలు గెలిచిన జిమ్నాస్ట్‌ బైల్స్‌. తొలి ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు గెలిచిన తొలి అమెరికా జిమ్నాస్ట్‌. ఇలా ఆమె సాధించిన ఘనతల గురించి చెప్పుకుంటే పోతే ఎన్నో!

అమ్మమ్మ.. తాతయ్యలే..

సైమన్‌కు అమ్మమ్మ, తాతయ్యే అమ్మానాన్నలు. మద్యానికి, డ్రగ్స్‌కు బానిసలైన ఆమె తల్లిదండ్రులకు నలుగురు పిల్లలను పోషించడానికి శక్తిలేని కారణంగా సైమన్‌ చిన్నప్పటి నుంచి వారి దగ్గరే పెరిగింది. ఆమెను దత్తత తీసుకున్న వాళ్లు తమ సొంత కూతురిగా పెంచారు. సైమన్‌ కూడా వాళ్లను అమ్మమ్మ, తాతయ్య అని కాకుండా అమ్మానాన్న అని పిలుస్తుంది. "సైమన్‌ది మొండి పట్టుదల. ఏదైనా అనుకుంటే కచ్చితంగా చేసి తీరుతుంది. జిమ్నాస్టిక్స్‌ కూడా అంతే. జూనియర్‌ స్థాయిలో ఓ టోర్నీలో అన్ని విభాగాల్లో పతకం సాధించడంలో విఫలమైంది. దాంతో పాఠశాలకు వెళ్లడం మానేసి శిక్షణపై మరింత దృష్టి పెట్టింది. ఆ తర్వాత ఏడాది అదే టోర్నీలో అన్ని విభాగాల్లో పతకాలు సాధించింది" అని ఆమె తాత చెప్పుకొచ్చాడు.

A special story on gymnast Simone Biles
జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌

ఇదీ చూడండి: ఈ బాల దిగ్గజాలు పర్వతాలు ఎక్కేస్తున్నారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.