మొదటి మ్యాచ్‌లోనే ఆసియా గేమ్స్ ఛాంపియన్ జపాన్ను ఓడించింది భారత పురుషుల హాకీ జట్టు. టోర్నీలో మొత్తం మూడు విజయాలు సాధించి, ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుని ఫైనల్‌కు దూసుకెళ్లింది. 6 దేశాలు పాల్గొంటున్న ఈ లీగ్‌లో టేబుల్ టాపర్‌గా ఉన్న భారత్... శుక్రవారం జరిగే నామమాత్రపు మ్యాచ్‌లో పోలాండ్‌తో తలపడనుంది.
పోలాండ్(21వ ర్యాంక్)తో జరిగే మ్యాచ్‌లో 5వ ర్యాంకులో ఉన్న భారత్.. ప్రధానంగా అటాకింగ్‌పైనే దృష్టి పెట్టనుంది. తుదిపోరుకు సన్నాహకంగా భావిస్తున్న ఈ మ్యాచ్‌లోనూ గెలవాలని పట్టుదలగా ఉంది. అదే ఊపును ఫైనల్లోనూ ప్రదర్శించి విజయం సాధించాలి అనుకుంటోంది.
కెనడాపై హ్యాట్రిక్ గోల్స్‌తో ఫామ్‌లోకి వచ్చిన మన్దీప్ సింగ్‌కు మిగిలిన ఆటగాళ్ల నుంచి మద్దతు అవసరం. వరుణ్ కుమార్ తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.
అజ్లాన్ షా హాకీ టోర్నీ కప్పును ఐదుసార్లు సాధించిన భారత్ రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 10 టైటిళ్లతో మొదటి స్థానంలో ఉంది.
ప్రస్తుత టోర్నీ మొదటి మ్యాచ్‌లో జపాన్ పై 2-0 తేడాతో గెలిచిన భారత్, మలేషియాపై 4-2, కెనడాపై 7-3 తేడాతో విజయం సాధించింది. కొరియాతో జరిగిన మ్యచ్‌ను డ్రా చేసుకుంది.
ఇవీ చూడండి..ముంబయి ఇండియన్స్ జట్టులో మరో కొత్త బౌలర్