ETV Bharat / sports

హాకీ అంపైర్స్​ మేనేజర్​ వీరేంద్ర సింగ్ మృతి

హాకీ ఇండియా అంపైర్స్​ మేనేజర్​ వీరేంద్ర సింగ్ కరోనా సంబంధిత సమస్యలతో మరణించారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించింది హాకీ ఇండియా.

virendra singh, Hockey umpire's manager
వీరేంద్ర సింగ్, హాకీ ఇండియా అంపైర్స్ మేనేజర్
author img

By

Published : Apr 27, 2021, 6:00 PM IST

కరోనా సంబంధిత సమస్యలతో హాకీ ఇండియా అంపైర్స్​ మేనేజర్​ వీరేంద్ర సింగ్​ మరణించారు. ఉత్తర్​ప్రదేశ్​లోని మేరఠ్​కు చెందిన 47 ఏళ్ల వీరేంద్ర మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది హాకీ ఇండియా.

"హకీ ఇండియా అంపైర్స్ మేనేజర్​ వీరేంద్ర సింగ్​ మృతి మమ్మల్ని ఎంతగానో కలిచివేసింది. ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాం" అని హాకీ ఇండియా అధ్యక్షుడు జ్ఞానేంద్ర నింగోంబం ప్రకటించారు.

ఇదీ చదవండి: హాకీ మాజీ అంపైర్​ సురేష్ ఠాకుర్ మృతి

ఆల్​ఇండియా టోర్నీలు, జాతీయ ఛాంపియన్స్​షిప్స్​తో పాటు అంపైర్స్ మేనేజర్​గా వీరేంద్ర క్రియాశీలంగా వ్యవహరించారు. ఆయన హయాంలో మంచి అంపైర్లను ఎంపిక చేశారు. ఇటీవల ముగిసిన 56వ ఆల్​ ఇండియా వీర్​ సింగ్​ జు దేవ్​ మెమోరియల్​ టోర్నీతో పాటు 5వ ఆల్​ ఇండియా రాజ్​మాత విజయ్​ రాజే సింధియా వుమెన్స్​ టోర్నీల్లోనూ.. ఆయన అంపైర్స్​ మేనేజర్​గా వ్యవహరించారు.

ఇదీ చదవండి: సామాజిక సేవ కోసం పూనియా 'సోషల్​ బాట'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.