ETV Bharat / sports

ప్రతిష్ఠాత్మక ఖేల్​రత్న రేసులో స్టార్​ హాకీ ప్లేయర్లు - దీపిక హాకీ ప్లేయర్

క్రీడా పురస్కారాల కోసం నామినేషన్లను ప్రకటించింది హాకీ ఇండియా. ప్రతిష్ఠాత్మక రాజీవ్​ గాంధీ ఖేల్​రత్నకు స్టార్ ప్లేయర్లు శ్రీజేశ్, దీపిక పేర్లను సిఫార్సు చేసింది.

Rajiv Gandhi Khel Ratna
రాజీవ్ గాంధీ ఖేల్​రత్న
author img

By

Published : Jun 26, 2021, 5:56 PM IST

దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్​రత్నకు హాకీ పురుషుల జట్టు గోల్​కీపర్ పీఆర్ శ్రీజేశ్, మహిళల జట్టు మాజీ ప్లేయర్ దీపిక పేర్లను సిఫార్సు చేసింది హాకీ ఇండియా. అర్జున అవార్డు కోసం హర్మన్​ప్రీత్ సింగ్, వందనా కటారియా, నవ్​జోత్​ పేర్లను నామినేట్ చేస్తున్నట్లు శనివారం ప్రకటించింది.

ధ్యాన్​చంద్ జీవిత సాఫల్య పురస్కారానికి దిగ్గజాలు డా.ఆర్​.పి సింగ్, సంఘై ఇబెంహల్​ పేర్లను కేంద్రానికి పంపింది హాకీ ఇండియా. కోచ్​లు బీజీ కరియప్ప, సీఆర్​ కుమార్​ పేర్లను ద్రోణాచార్యా అవార్డుకు సిఫార్సు చేసింది.

2018 హాకీ ఛాంపియన్స్​ ట్రోఫీలో వెండి పతకం, అదే ఏడాది ఆసియా గేమ్స్​లో కాంస్యం, ఎఫ్​ఐహెచ్​ మెన్స్​ సిరీస్​లో భారత్​ బంగారు పతకం సాధించడంలో శ్రీజేశ్ కీలక పాత్ర పోషించాడు. 2018 ఆసియా​ గేమ్స్​, ఆసియా ఛాంపియన్స్​ ట్రోఫీలో భారత మహిళల జట్టు రజతాలు సాధించడంలో దీపిక ముఖ్య భూమిక పోషించింది.

ఇవీ చూడండి:

హాకీలో దేశానికి 27 పతకాలు తెచ్చిపెట్టింది ఆ ఊరే

రాజీవ్​ ఖేల్​రత్న వెనక్కిచ్చేస్తా: విజేందర్​ సింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.