గతేడాది ప్రారంభమైన అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్ఐహెచ్) ప్రో లీగ్ విజయవంతమైంది. అయితే ఇది హాకీ సిరీస్ ఈవెంట్స్‌కు అడ్డంకిగా మారనుంది. వచ్చే ఏడాది ఒలింపిక్స్, ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీలు జరుగనున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశవాళీ మ్యాచ్‌లపై దృష్టి సారించాలని నిర్ణయించింది ఎఫ్ఐహెచ్.
"ఎఫ్ఐహెచ్ సిరీస్ ఈవెంట్స్ 2019 తర్వాత ఆగిపోనున్నాయి. ఉపఖండ క్వాలిఫయర్స్, ఛాంపియన్షిప్పైనా జాతీయ జట్లు ప్రధానంగా దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం" -అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్
తర్వాతి ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం జూన్28,29 తేదీల్లో ఆమ్స్టర్డామ్ వేదికగా జరగనుంది.