ETV Bharat / sports

హర్మన్‌ప్రీత్‌ మాయ.. తొలిపోరులో హాకీ జట్టు ఘన విజయం

ఒలింపిక్స్​లో న్యూజిలాండ్​తో జరిగిన పోరులో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత విజయం సాధించింది. 3-2 తేడాతో ప్రత్యర్థిని ఓడించింది.

Harmanpreet
హర్మన్‌ప్రీత్‌
author img

By

Published : Jul 24, 2021, 12:01 PM IST

ఒలింపిక్స్‌లో టీమ్‌ఇండియా శుభారంభం చేసింది. పురుషుల హాకీలో న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో ఘన విజయం సాధించింది. 3-2 తేడాతో ప్రత్యర్థిని ఓడించింది. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (26ని, 33ని) రెండు గోల్స్‌తో దుమ్మురేపగా మాజీ సారథి, గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ ప్రత్యర్థి పాయింట్లను అడ్డుకున్నాడు. గోల్‌పోస్ట్‌ వద్ద గోడలా నిలబడ్డాడు. రూపిందర్‌పాల్‌ సింగ్‌ (10 ని) మొదటి గోల్‌ చేశాడు.

hockey
పురుషుల హాకీ జట్టు

మ్యాచ్‌ మొదలైన ఆరో నిమిషంలోనే న్యూజిలాండ్‌ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. పెనాల్టీ కార్నర్‌ను కేన్‌ రసెల్‌ సద్వినియోగం చేసుకున్నాడు. ఐతే పదో నిమిషంలో రూపిందర్‌ గోల్‌ కొట్టి స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. స్ట్రైకర్‌ మన్‌దీప్‌ సింగ్‌ స్కోరు చేయనప్పటికీ మైదానంలో చురుగ్గా కదిలాడు. జట్టుకు గోల్‌ అవకాశాలు సృష్టించాడు.

రెండో క్వార్టర్‌లో గుర్జంత్‌ భారత్‌కు ఆధిక్యం అందించేందుకు ప్రయత్నించాడు. కివీస్‌ గోల్‌కీపర్‌ లియాన్‌ హేవర్డ్‌ దానిని అడ్డుకోవడం గమనార్హం. అయితే 26వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ గోల్‌ కొట్టి టీమ్‌ఇండియాను 2-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. కోర్టు మారగానే మళ్లీ అతడే 33వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలవడంతో భారత్‌ 3-1తో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. కాగా మరో 10 నిమిషాల వ్యవధిలోనే స్టీఫెన్‌ జోసెఫ్‌ గోల్‌ కొట్టి స్కోరును 2-3కు తగ్గించాడు.

ఆఖరి నిమిషాల్లో న్యూజిలాండ్‌ దూకుడుగా ఆడింది. వరుసగా పెనాల్టీ కార్నర్లు సాధించింది. ఐతే అనుభవజ్ఞుడైన గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ వాటిని చక్కగా అడ్డుకున్నాడు. మరో 24 సెకన్లలో ఆట ముగుస్తుందనగా కివీస్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను అతడే విజయవంతంగా అడ్డుకొని భారత్‌కు పూర్తి పాయింట్లు వచ్చేలా చేశాడు. హాకీలో తిరుగులేని జట్టు, దుర్భేద్యమైన ఆసీస్‌ను భారత్‌ ఆదివారం ఢీకొట్టనుంది.

ఇదీ చూడండి: ఒలింపిక్స్​ తొలి గోల్డ్​ మెడల్​ చైనాదే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.