ETV Bharat / sports

మరో భారత హాకీ మాజీ ఆటగాడు కరోనాతో మృతి

author img

By

Published : May 8, 2021, 8:00 PM IST

భారత హాకీ మాజీ ఆటగాడు ఎమ్​కే కౌషిక్(66)​ కొవిడ్​తో మృతిచెందారు. ఆయన మరణం పట్ల పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

M K Kaushik
ఎమ్​కే కౌషిక్

శనివారం, భారత హాకీ మాజీ ఆటగాడు రవీందర్ పాల్ సింగ్ కొవిడ్​తో మరణించిన కొద్ది గంటల్లోనే మరో హాకీ మాజీ ఆటగాడు, కోచ్​ ఎమ్​కే కౌషిక్(66)​ వైరస్​తో పోరాడుతూ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు క్రీడాప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

కౌషిక్​.. 1998లో అర్జున, 2002లో ద్రోణాచార్య అవార్డులను అందుకున్నారు. 1980 మాస్కో ఒలింపిక్స్​లో స్వర్ణ పతకాన్ని సాధించారు. భారత పురుషుల, మహిళ హాకీ జట్లకు కోచ్​గా వ్యవహరించారు. ఆయన ఆధ్వర్యంలో 1998 బ్యాంకాంక్​లో జరిగిన ఆసియన్​ గేమ్స్​లో పురుషుల జట్టు గెలుపొందగా.. 2006 దోహా ఆసియన్​ గేమ్స్​లో మహిళల జట్టు కాంస్య పతకాన్ని అందుకుంది.

ఇదీ చూడండి: కరోనాతో భారత హాకీ మాజీ ఆటగాడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.