2022/2023 పురుషుల, మహిళల హాకీ ప్రపంచకప్‌కు సంబంధించిన కొత్త అర్హత ప్రక్రియను ప్రకటించింది అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్). ఇందులో భాగంగా మొత్తం 16 స్థానాలకుగాను ఐదు ఖండాంతర ఛాంపియన్‌షిప్‌ల ద్వారా 11 జట్లకు ప్రపంచకప్‌లో బెర్త్‌లు కేటాయిస్తారు. మిగిలిన ఐదింటి కోసం 2022 మార్చిలో అర్హత పోటీలు నిర్వహిస్తారు. ఛాంపియన్షిప్ విజేతలకు మాత్రమే ప్రపంచకప్‌లో నేరుగా బెర్తు లభిస్తుంది. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెట్టింపు చేయాలని ఎఫ్ఐహెచ్ భావిస్తోంది.
ఖండాంతర కోటా ద్వారా రెండు ప్రపంచకప్‌లలో ఐరోపా గరిష్ట వాటాను సొంతం చేసుకుంది. మహిళా ప్రపంచకప్‌లో హోలాండ్, స్పెయిన్లు ఆతిథ్యమిస్తుండటం వల్ల నేరుగా అర్హత పొందాయని హాకీ సమాఖ్య తన వెబ్సైట్లో పేర్కొంది.
ఖండాంతర కోటా సవరించిన తర్వాత ప్రపంచకప్‌లో స్థానాల సంఖ్య:
మహిళల ప్రపంచకప్: ఆఫ్రికా నుంచి 1 దేశం, ఆసియా నుంచి 2, ఐరోపా 4 (నిర్వహకులు హోలాండ్, స్పెయిన్), ఓషియానియా 2, పనామ్ నుంచి 2 దేశాలకు స్థానం కల్పించనున్నారు.
పురుషుల ప్రపంచకప్: ఆఫ్రికా 1, ఆసియా 3 (ఆతిథ్య భారత్‌తో కలుపుకుని), ఐరోపా 4, ఓషియానియా 2, పనామ్ 1.
ఇదీ చూడండి... విండీస్‌తో తొలి టెస్టులో జో రూట్ డౌటే!