భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్‌తో పాటు మరో ఆరుగురు క్రీడాకారిణీలకు కొవిడ్ నిర్ధారణ అయింది. తమ స్వస్థలాల నుంచి బెంగళూరులోని సాయ్ కేంద్రానికి వచ్చిన వీరికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా తేలింది.
రాణి రాంపాల్, సవిత పూనియా, షర్మిలా దేవి, రజనీ, నవ్‌జోత్ కౌర్, నవ్‌నీత్ కౌర్, సుషీల.. వైరస్ బారిన పడ్డారు. వీరితో పాటు మరో ఇద్దరు సహాయక సిబ్బందికి కూడా కొవిడ్ సోకింది. వీరందరూ ప్రస్తుతం బెంగళూరు సాయ్ ఎన్సీఓఈలోని క్వారంటైన్లో ఉన్నారని సాయ్ తెలిపింది.
ఇదీ చదవండి: టాస్ గెలిచిన కోల్‌కతా.. పంజాబ్ బ్యాటింగ్
"భారత మహిళల హాకీ జట్టులోని ఏడుగురు క్రీడాకారిణీలతో పాటు వీడియో అనలిస్ట్ అమృత ప్రకాశ్, సైంటిఫిక్ అడ్వైజర్ వేన్ లాంబర్డ్లకు కరోనా నిర్ధారణ అయింది. వారందరూ స్వస్థలాల నుంచి బెంగళూరు సాయ్కు రాగానే ఏప్రిల్ 24న చేసిన పరీక్షలు నిర్వహించాం."
-స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.
టోక్యో ఒలింపిక్స్ సన్నాహాల కోసం ఈ బృందం బెంగళూరు సాయ్‌లో సాధన చేస్తుంది. కాగా పది రోజుల పాటు వీరికి విరామం లభించింది. తిరిగి శిక్షణ కేంద్రానికి రాగా.. తాజాగా కేసులు నిర్ధారణ అయ్యాయి.
ఇదీ చదవండి: 'బయట భయానకం.. బబుల్‌లోనే సురక్షితం'