ఆటలో భాగంగా ఆటగాళ్లు కవ్వింపులకు దిగడం, స్లెడ్జింగ్ చేయడం సాధారణమైన విషయమే. కానీ, ఆటగాళ్లతో అభిమానులు గొడవకు దిగడం ఎక్కడైనా చూశారా? ఫ్రాన్స్ అలియాంజ్ రివీరా స్టేడియం వేదికగా జరిగిన ఫ్రెంచ్ లీగ్-1 మ్యాచ్‌లో అచ్చంగా ఇదే ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నీస్- మార్సెయిల్ (Nice vs Marseille) జట్ల మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో నీస్ అభిమానులు గ్రౌండ్లోకి వాటర్ బాటిళ్లు విసిరారు. మార్సిల్లీ ఆటగాడు దిమిత్రి పాయేట్ అదే బాటిల్‌ను తిరిగి స్టాండ్స్‌లోకి విసిరాడు. అంతే, ప్రేక్షకులు ఒక్కసారిగా మైదానంలోకి దూసుకొచ్చారు. ప్లేయర్లపై దాడికి దిగారు. దీంతో ఈ మ్యాచ్‌ను మధ్యలోనే నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. సెక్యూరిటీ సిబ్బంది ఈ గొడవను ఆపడానికి ప్రయత్నించారు.
-
Nice Marseille kicking off!! 🤭🤭 pic.twitter.com/9eo12660gh
— Gunner (@Gunnerball66) August 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Nice Marseille kicking off!! 🤭🤭 pic.twitter.com/9eo12660gh
— Gunner (@Gunnerball66) August 22, 2021Nice Marseille kicking off!! 🤭🤭 pic.twitter.com/9eo12660gh
— Gunner (@Gunnerball66) August 22, 2021
మార్సెయిల్ ఫుట్‌బాల్ అధ్యక్షుడు పాబ్లో లాంగోరియా.. 'తమ ప్లేయర్లపై దాడి జరిగిందని' ప్రకటించారు. ఆటగాళ్ల భద్రతకు గ్యారంటీ ఇవ్వలేమని మ్యాచ్ నిర్వాహకులు చెప్పారు. దీంతో మ్యాచ్ తిరిగి ప్రారంభించడానికి మార్సెయిల్ జట్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.
'మ్యాచ్ నిర్వాహకులు ఆటను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ, మార్సెయిల్ జట్టు అందుకు ఒప్పుకోలేదు' అని నీస్ ఫుట్‌బాల్ అధ్యక్షుడు జీన్ పీర్రే పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మెస్సీ వాడిన టిష్యూ పేపర్‌కు ఏడున్నర కోట్లా?