క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా తమిళనాడులోని ఓ బేకరీ యజమాని వినూత్నంగా ఆలోచించారు. ఇటీవల మరణించిన దిగ్గజ ఫుట్‌బాలర్ డిగో మారడోనాకు ఆయన నిలువెత్తు కేక్‌ను రూపొందించి నివాళులర్పించారు. ఇందుకోసం 60 కిలోల చక్కెర, 270 గుడ్ల వినియోగంతో.. నాలుగు రోజులు శ్రమించి పూర్తి చేసినట్లు వెల్లడించారు.
"అర్జెంటీనాలోని చిన్న పట్టణంలో పుట్టి.. అకుంఠిత శ్రమతో అందలానికి చేరాడు మారడోనా. క్రికెట్‌కు సచిన్, 100 మీటర్ల పరుగుకు బోల్ట్, బాక్సింగ్‌కు మైక్ టైసన్ ఎలానో ఫుట్‌బాల్ అనగానే మారడోనా గుర్తుకొస్తాడు. ఈ కేక్ ఆయనకు నివాళిగా తయారు చేశాం. అలాగే పిల్లలు ఫోన్లలో కాకుండా ఆరుబయట ఆడుకోవాలని ప్రోత్సాహిస్తున్నాం"
--సతీశ్ రంగనాథన్, బేకరీ యజమాని
అంతకుముందు మ్యాస్ట్రో ఇళయరాజా, భారతీయార్ సహ ప్రముఖుల ఫోటోలను కూడా ఇదే తరహాలో ప్రతిష్ఠించారు సతీశ్. వీటితో తన బేకరీ విక్రయాలు పెరుగుతాయని అంటున్నారు.
ఇదీ చూడండి: ఔరా.. కేక్‌తో ఆరడుగుల 'బాలు' విగ్రహం