ETV Bharat / sports

మెస్సీ కోసం ఒక్కరాత్రి ఖర్చు రూ.14 లక్షలు

మెస్సీ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తోంది పీఎస్​జీ క్లబ్. అతడు ఒక్క రాత్రి హోటల్​లో ఉండేందుకు భారీగా ఖర్చు చేసింది.​కాంట్రాక్టులో భాగంగా ఏడాది రూ.360 కోట్లు మొత్తం ఇవ్వనుంది.

Lionel Messi
మెస్సీ
author img

By

Published : Aug 14, 2021, 5:30 AM IST

స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్‌ మెస్సీ.. పారిస్​ సెయింట్​ జర్మైన్​ క్లబ్​(పీఎస్​జీ)తో ఇటీవల రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఈ క్లబ్​తో కాంట్రాక్ట్ డీల్ కుదుర్చుకునేందుకు పారిస్​లోని హోటల్ లీ రాయల్​ మాన్​కియోలో ​ తన కుటుంబంతో కలిసి ఒక్క రాత్రి ఉన్నాడు మెస్సీ. అందుకోసం సుమారు రూ 13.5 లక్షలు ఖర్చు చేసింది పీఎస్​జీ. కాంట్రాక్ట్​లో భాగంగా మెస్సీకి ఏడాదికి రూ.360 కోట్లు ఇవ్వనుంది. ఇవికాక ఇంకా ఇతర అలవెన్సులు, బోనస్​లు కూడా ఉండనున్నాయి. మెస్సీ జెర్సీ నెంబర్ 30 ను పీఎస్​జీ వెబ్​సైట్​లో విడుదల చేసిన 30 నిమిషాలకే జెర్సీలు అన్నీ అమ్ముడయ్యాయి. మెస్సీ రాకతో.. పీఎస్​జీ ఇన్​స్టా ఫాలోవర్లు దాదాపు 20 మిలియన్​లకు పైగా పెరిగడం విశేషం.

అడుగడుగునా ఫ్యాన్స్​..

పీఎస్​జీ క్లబ్​తో ఒప్పందం సందర్భంగా పారిస్​ చేరుకున్న మెస్సీకి విమానాశ్రయం నుంచే అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి మెస్సీ సంతకం చేయబోయే పార్క్ దీ ప్రిన్సెస్ స్టేడియం వరకు అభిమానులతో నిండిపోయింది. ఎయిర్​పోర్ట్ నుంచి నేరుగా హోటల్​కు చేరుకున్న మెస్సీ.. తర్వాత స్టేడియంకు వెళ్లారు.

లియోనల్ మెస్సీ-'ఎఫ్​సీ బార్సిలోనా' 21 ఏళ్ల బంధానికి ఇటీవల తెరపడింది. అతడితో తమ కాంట్రాక్టు ముగిసిందని సదరు పుట్​బాల్​ క్లబ్​ అధికారికంగా ప్రకటించింది. స్పానిష్ లీగ్​లోని​ ఆర్థిక నిబంధనల వల్ల మెస్సీతో కాంట్రాక్టు కొనసాగించలేకపోతున్నామని వెల్లడించింది.

సుదీర్ఘకాలం పాటు బార్సిలోనా ఫుట్‌బాల్‌ క్లబ్‌తో కొనసాగిన మెస్సీ.. వీడే క్రమంలో కన్నీటి పర్యంతమయ్యాడు. మెస్సీకి వీడ్కోలు పలికేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో తాను కంటతడి పెట్టడమే కాకుండా చూస్తున్న వారినీ కన్నీళ్లు పెట్టించాడు. తన జీవితంలో అత్యంత బాధాకరమైన రోజుగా దీనిని అభివర్ణించాడు.

ఇవీ చదవండి:

ఆ క్లబ్​తో కొత్త ఒప్పందానికి మెస్సీ గ్రీన్ సిగ్నల్!
ప్యారిస్ క్లబ్​తో మెస్సీ కాంట్రాక్ట్.. ఫ్యాన్స్ హంగామా

బార్సిలోనాతో ముగిసిన మెస్సీ బంధం

Lionel Messi: సాకర్​ స్టార్​​ 'మెస్సీ' భావోద్వేగం.. కారణమిదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.