ETV Bharat / sports

నోరూరించేలా ఫుట్​బాలర్ రొనాల్డో చాక్లెట్ శిల్పం - ఫుట్​బాలర్ రొనాల్డో చాక్లెట్ శిల్పం

ప్రముఖ ఫుట్​బాలర్ క్రిస్టియానో రొనాల్డో నిలువెత్తు చాక్లెట్​ శిల్పాన్ని తయారు చేశాడో కళాకారుడు. పోర్చుగల్​లో ప్రస్తుతం జరుగుతున్న కార్నివాల్​లో దీనిని ప్రదర్శనకు ఉంచారు.​

ronaldo
నోరూరించేలా ఫుట్​బాలర్ రొనాల్డో చాక్లెట్ శిల్పం
author img

By

Published : Feb 27, 2020, 6:20 PM IST

Updated : Mar 2, 2020, 6:51 PM IST

స్టార్ ఫుట్​బాలర్​ క్రిస్టియానో రొనాల్డో.. తన ఆటతో ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. అతడిపై ఉన్న ఇష్టానికి గుర్తుగా, రొనాల్డో లైఫ్​ సైజ్​ చాక్లెట్​ విగ్రహాన్ని తయారు చేశాడు జార్జ్​ కర్డాసో అనే ఓ శిల్పి. ఈ మంగళవారమే ఆవిష్కరించారు. రొనాల్డో స్వస్థలం పోర్చుగల్​లోని ఓవర్​లో జరుగుతున్న కార్నివాల్​లో ఈ విగ్రహాన్ని ప్రదర్శనకు ఉంచారు.

నోరూరించేలా ఫుట్​బాలర్ రొనాల్డో చాక్లెట్ శిల్పం

జార్జ్.. చాక్లెట్​తో విగ్రహాలు చేయడంలో సిద్ధహస్తుడు. ఇంతకు ముందు 2018లో కళాత్మక చాక్లెట్ శిల్పాల తయారీ పోటీలో ప్రపంచ ఛాంపియన్​గా నిలిచాడు. ఓవర్​లో పుట్టిన ఇతడు ప్రస్తుతం స్విట్జర్లాండ్​లో నివాసముంటున్నాడు.

200 గంటలు.. 17 గంటల ప్రయాణం

రొనాల్డో విగ్రహాన్ని దాదాపు 120 కిలోల చాక్లెట్​తో 187 సెంటీమీటర్ల ఎత్తుతో తయారు చేశాడు జార్జ్. దాదాపు 200 గంటలు(9 రోజులు) కష్టపడ్డాడు. అనంతరం స్విట్జర్లాండ్​ నుంచి ఓవర్​కు తెచ్చేందుకు సుమారు 17 గంటల ప్రయాణం చేసి, ఈ శిల్పాన్ని పోర్చుగల్​లో జరుగుతున్న కార్నివాల్​కు తీసుకొచ్చారు.

ఓవర్​ నగరంలో జరుగుతున్న సంప్రదాయ కార్నివల్​ ఎగ్జిబిషన్​లో ప్రదర్శనకు ఉంచారు. ఆ తర్వాత మడైరాలోని రొనాల్డో సొంత మ్యూజియానికి ఈ విగ్రహాన్ని తరలిస్తారు.

ఇదీ చూడండి.. కివీస్​పై గెలుపుతో ప్రపంచకప్​ సెమీస్​కు భారత్

Last Updated : Mar 2, 2020, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.