భారత ఫుట్‌బాల్ జట్టు.. జూన్‌లో థాయ్‌లాండ్‌లో జరిగే కింగ్స్ కప్ ఆడనుంది. ఈ మేరకు భారత జట్టుకు ఆహ్వానం అందింది. ఇండియాతో పాటు ఆతిథ్య థాయ్‌లాండ్, వియత్నాం, కురకావో దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటాయి. మ్యాచ్‌లన్నీ చాంగ్ ఏరినా, బురిరామ్లో జరగనున్నాయి. గతేడాది ఈ టోర్నీలో స్లొవేకియా విజేతగా నిలిచింది.
ఫిఫా నిర్వహించే ఈ కింగ్స్ కప్.. 1968 నుంచి థాయ్‌లాండ్‌లో జరుగుతుంది. భారత జట్టు చివరిసారిగా 1977లో ఈ టోర్నీలో పాల్గొంది.
జూన్ 5న జరిగే రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్లు..కప్ కోసం పోటీ పడతాయి. 18 సంవత్సరాల తర్వాత ఫిఫా ర్యాంకింగ్ కలిగిన టోర్నీలో ఆడనుంది భారత ఫుట్‌బాల్ జట్టు. చివరగా 2001లో మెర్దకా టోర్నమెంట్లో పాల్గొన్నారు బ్లూ టైగర్స్.
ప్రస్తుత ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్ 101, థాయ్‌లాండ్ 114, వియత్నాం 98, కురకావో 82 స్థానాల్లో ఉన్నాయి.
ఇవీ చూడండి: