ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2022 కోసం భారత్ ఆడాల్సిన క్వాలిఫయర్ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. ఈ ఏడాదే క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. కరోనా ప్రభావంతో వాటిని వచ్చే మార్చి నుంచి నిర్వహించాలని నిర్ణయించారు.
తొలి దశ మ్యాచ్‌లు మార్చి 20-30 మధ్య, చివరి దశ మ్యాచ్‌లు మే 31-జూన్ 15 మధ్య జరుగుతాయి. వీటితో పాటు 2023 ఆసియా కప్ ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ రౌండ్ మ్యాచ్‌లు వచ్చే సంవత్సరానికి వాయిదా పడ్డాయి.
ఇదీ చూడండి:ఆసీస్-కివీస్‌లో ఫిఫా 2023 మహిళల ప్రపంచకప్