ETV Bharat / sports

సాకర్​ ఆటగాడి పేరుతో తొలి స్టేడియం.. ఎక్కడుందో తెలుసా? - క్రీడా వార్తలు

భారత ఫుట్​బాల్​ దిగ్గజం భుటియాకు అరుదైన గౌరవం దక్కింది. అతని పేరుతో సిక్కింలో ఓ స్టేడియాన్ని నిర్మించారు. దేశంలో సాకర్​‌ ఆటగాడి పేరుతో నిర్మించిన తొలి స్టేడియం ఇదే కావడం విశేషం.

Bhutia
భైచుంగ్‌ భుటియా
author img

By

Published : Aug 25, 2020, 8:21 AM IST

భారత దిగ్గజ ఫుట్‌బాల్‌ ఆటగాడు భైచుంగ్‌ భుటియా పేరుతో సిక్కింలో ఓ స్టేడియం నిర్మితమైంది. 15వేల మంది కూర్చునే సామర్థ్యం కలిగిన ఈ మైదానాన్ని.. కరోనా పరిస్థితులు చక్కబడ్డిన తర్వాత ప్రారంభించనున్నారు. భుటియా పుట్టిన ఊరికి 25 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన ఈ స్టేడియంలో.. ఫ్లడ్‌లైట్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. దేశంలో సాకర్​‌ ఆటగాడి పేరుతో నిర్మించిన తొలి స్టేడియం ఇదే.

ఈ గౌరవం దక్కించుకున్నందుకు సంతోషంగా ఉందని తెలిపాడు భుటియా. భారత్‌ తరపున 100 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి ఫుట్​బాల్ ప్లేయర్​ ఇతడు.

"ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. చాలా ఉత్తేజంగానూ ఉంది. యువ ఫుట్‌బాల్‌ ఆటగాళ్లకు అత్యుత్తమ సౌకర్యాలతో కూడిన మరో మైదానం అందుబాటులోకి వస్తుండడం చాలా ఆనందంగా ఉంది’’ అని భుటియా పేర్కొన్నాడు.

ఈ నూతన మైదానంలో ఓ ఫుట్​బాల్​ అకాడమీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించాడు భుటియా. అన్నీ సిద్ధమైతే ఇక్కడ గోల్డెన్​ బేబీ లీగ్​లను నిర్వహించాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. 2010లో ఈ స్టేడియం పనులు ప్రారంభించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.