అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో 100 గోల్స్‌తో రికార్డు సృష్టించిన స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో. అయితే టీవీలో మాత్రం ఫుట్‌బాల్ కంటే బాక్సింగ్ లేదా యూఎఫ్‌సీ మ్యాచ్‌లు ఎక్కువగా చూసేందుకు ఇష్టపడతానని అన్నాడు. దాని వల్లే ఫుట్‌బాల్ బాగా ఆడుతున్నానని చెప్పాడు.
"ఫుట్‌బాల్ ఆడడం నా వృత్తి. కానీ, టీవీలో ఇతర క్రీడలను ఎక్కువగా చూస్తాను. బాక్సింగ్, ఫుట్‌బాల్ చూడాలా అన్న అవకాశం వచ్చినప్పుడు నేను బాక్సింగ్ చూసేందుకే ఆసక్తి చూపిస్తాను. బాక్సింగ్ ప్రాక్టీసు చేయడం వల్ల ఫుట్‌బాల్‌లో బాగా ఆడగలుగుతున్నానని నమ్ముతాను. మాంచెస్టర్ యునైటెడ్‌లో ఉన్నప్పుడు ఓ కోచ్ నాతో బాక్సింగ్ చేశారు. 33 ఏళ్ల వయస్సులోనూ నేను ఫుట్‌బాల్‌ను ఆడాలని అనుకుంటున్నాను. మన శరీరాన్ని ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు కానీ, అంతకంటే ముందు మానసికంగా సన్నద్ధమవ్వాలి"
-- క్రిస్టియానో రొనాల్డో, ప్రముఖ ఫుట్‌బాలర్
సెరీ-ఏ టోర్నీలో 50 గోల్స్ పూర్తి చేశాడు రొనాల్డో. ఫలితంగా ఈ టోర్నీలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ప్రీమియర్ లీగ్, లా లిగాలోనూ 50 గోల్స్ చేసిన తొలి ఆటగాడు రొనాల్డోనే. యూరప్‌లోని ఐదు ప్రముఖ లీగ్‌ల్లో 400 విజయాలు నమోదు చేసి, ఈ శతాబ్దంలోనే సరికొత్త రికార్డు సృష్టించాడు.
ఇదీ చూడండి:రొనాల్డో ఇంటికి రూ.75 కోట్ల విలువైన అతిథి!