ఫ్రాన్స్ నిర్వహించిన ఫిఫా మహిళల ప్రపంచకప్-2019 విజేతగా అమెరికా అవతరించింది. ఫలితంగా నాలుగోసారి ప్రపంచ ఫుట్‌బాల్ ఛాంపియన్‌ను కైవసం చేసుకుంది. ఫ్రాన్స్‌లోని లయన్ నగరంలో పార్క్ ఒలింపిక్ లయోనిస్ మైదానంలో ఆదివారం నెదర్లాండ్స్, అమెరికా మధ్య ఫిఫా ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టును 2-0 తేడాతో ఓడించారు అమెరికా క్రీడాకారిణులు.
-
🏆 C H A M P I O N S 🏆 @USWNT 👏👏👏
— FIFA Women's World Cup (@FIFAWWC) July 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Highlights 👉 https://t.co/M5OavEvdZU
TV listings 👉 https://t.co/t64sDOEs52 pic.twitter.com/zdVnUuRCj7
">🏆 C H A M P I O N S 🏆 @USWNT 👏👏👏
— FIFA Women's World Cup (@FIFAWWC) July 7, 2019
Highlights 👉 https://t.co/M5OavEvdZU
TV listings 👉 https://t.co/t64sDOEs52 pic.twitter.com/zdVnUuRCj7🏆 C H A M P I O N S 🏆 @USWNT 👏👏👏
— FIFA Women's World Cup (@FIFAWWC) July 7, 2019
Highlights 👉 https://t.co/M5OavEvdZU
TV listings 👉 https://t.co/t64sDOEs52 pic.twitter.com/zdVnUuRCj7
-
#USA HAVE WON THE #FIFAWWC 2019! #LaGrandeFinale | #USANED🇺🇸🇳🇱 pic.twitter.com/sjDVeuXSXo
— FIFA Women's World Cup (@FIFAWWC) July 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#USA HAVE WON THE #FIFAWWC 2019! #LaGrandeFinale | #USANED🇺🇸🇳🇱 pic.twitter.com/sjDVeuXSXo
— FIFA Women's World Cup (@FIFAWWC) July 7, 2019#USA HAVE WON THE #FIFAWWC 2019! #LaGrandeFinale | #USANED🇺🇸🇳🇱 pic.twitter.com/sjDVeuXSXo
— FIFA Women's World Cup (@FIFAWWC) July 7, 2019
నాలుగోసారి ఛాంపియన్...
ఈ విజయంతో నాలుగోసారి ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించింది అమెరికా. వరుసగా రెండోసారి విజేతగా నిలిచి గతంలో జర్మని నెలకొల్పిన రికార్డును సమం చేసింది. 1991లో ప్రారంభమైన ఫిఫా మహిళల ప్రపంచకప్‌లో తొలి టైటిల్ విజేతగా నిలిచింది అమెరికా. తర్వాత 1999, 2015లో మరో రెండుసార్లు ఛాంపియన్‌గా అవతరించింది.
-
⭐️⭐️ HISTORY ⭐️⭐️@USWNT | #OneNationOneTeam pic.twitter.com/FZTBjRDcAc
— FIFA Women's World Cup (@FIFAWWC) July 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">⭐️⭐️ HISTORY ⭐️⭐️@USWNT | #OneNationOneTeam pic.twitter.com/FZTBjRDcAc
— FIFA Women's World Cup (@FIFAWWC) July 7, 2019⭐️⭐️ HISTORY ⭐️⭐️@USWNT | #OneNationOneTeam pic.twitter.com/FZTBjRDcAc
— FIFA Women's World Cup (@FIFAWWC) July 7, 2019
- 2011లోనూ ఫైనల్ చేరినా జపాన్ చేతిలో ఓటమిపాలయ్యారు అమెరికా అమ్మాయిలు.
- 1995, 2003, 2007లో మూడోస్థానంలో నిలిచింది అగ్రదేశం.
బంగారు బూటు, బంతి విజేత...
టోర్నీ మొత్తంగా అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారిణికి బంగారు బూటు అందజేస్తారు. అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి బంగారు బంతి అందజేస్తారు. ఫిపా మహిళల ప్రపంచకప్ 2019 టోర్నీలో సత్తచాటి బంగారు బంతి, బూటును గెలుచుకుంది మేగన్ రాపినోయ్.
-
Having more trophies than hands is for sure a good problem. 🤷♀️#USA #FIFAWWC pic.twitter.com/MshGogK4LP
— FIFA Women's World Cup (@FIFAWWC) July 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Having more trophies than hands is for sure a good problem. 🤷♀️#USA #FIFAWWC pic.twitter.com/MshGogK4LP
— FIFA Women's World Cup (@FIFAWWC) July 7, 2019Having more trophies than hands is for sure a good problem. 🤷♀️#USA #FIFAWWC pic.twitter.com/MshGogK4LP
— FIFA Women's World Cup (@FIFAWWC) July 7, 2019
" ఈ మెగాటోర్నీలో మాకున్న అనుభవంతోనే రాణించాం. కష్టమైన ప్రత్యర్థులతో తలపడ్డాం. యువ క్రీడాకారిణుల వెనుక సీనియర్ల భరోసా ఉంది కాబట్టే ఇంత విజయం సొంతమైంది. నాకౌట్ రేసులో నిలిచేందుకు చాలా శ్రమించాం కాని చివరికి కప్పు గెలిచాం".
-- మేగన్ రాపినోయ్
టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన వారిలో రెండో స్థానంలో నిలిచిన మరో అమెరికా క్రీడాకారిణి అలెక్స్ మోర్గాన్ వెండి బూటు గెలుచుకుంది.
కోచ్ అరుదైన ఘనత..
అమెరికా జట్టు కోచ్ జిల్ ఎలిస్ హయాంలోనే ఆ దేశానికి రెండోసారి ప్రపంచకప్ దక్కింది. ఇప్పటివరకు ఎవ్వరూ వరుసగా రెండు టైటిల్స్ అందించలేదు.
ఓటమి కన్నా అనుభవం ముఖ్యం...
ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది నెదర్లాండ్స్ .ఆ జట్టు ఓటమి తర్వాత మాట్లాడిన కోచ్ సెరీనా విగ్మ్యాన్... మహిళలకు ప్రోత్సాహం అందిస్తే గొప్ప విజయాలు సాధించవచ్చని అభిప్రాయపడింది.
"మేము ఫైనల్ గెలవాలని ఆశపడ్డాం. కాని సాధించలేకపోయాం. ప్రత్యర్థి బలంగా ఉండటం వల్లే మేము రన్నరప్‌గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మా ప్రదర్శన సంతృప్తికరంగా ఉంది. తొలిసారి ఒలింపిక్స్‌లో అడుపెడుతున్నాం. మా జట్టులో సగటు వయసు 26 సంవత్సరాలు. మరింత అనుభవం సంపాదిస్తే వాళ్లందరూ మంచి విజయాలు అందించగలరు. నేను జాతీయ జట్టుపై ఎక్కువ దృష్టి పెడతాను. గతంలో మహిళలు ఫుట్‌బాల్‌లోకి వచ్చేవారు కాదు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. వారికి కొంచెం తోడ్పాటు అవసరం. మహిళలను ఫుట్‌బాల్‌లోకి రప్పించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను ".
-- సెరీనా విగ్మ్యాన్, నెదర్లాండ్స్ కోచ్
విశేషాలు..
- ఈ ఏడాది ప్రపంచకప్‌తో తొలిసారి ఫైనల్ వరకు వెళ్లింది నెదర్లాండ్స్ జట్టు.
- ఒకే వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్ కొట్టిన జట్టు అమెరికా(26).
- గోల్డెన్ బూటు గెలుచుకున్న మేగన్ రాఫినోయ్... అతిపెద్ద వయసున్న గోల్‌స్కోరర్‌గా రికార్డు సృష్టించింది. 34 సంవత్సరాల రెండు నెలల వయసున్న ఆమె గతంలో కార్లీ లైలాయిడ్(32 సంవత్సరాల 354 రోజులు) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది.
- ఫ్రాన్స్‌లో విజేతలకు 40 లక్షల డాలర్లు(రూ.27 కోట్ల 38 లక్షలు) లభిస్తాయి. ఈ మొత్తం 2015 టోర్నమెంట్ ప్రైజ్‌మనీకి రెట్టింపు .
- గత ఏడాది పురుషుల వరల్డ్ కప్‌లో ఇచ్చిన మొత్తం నగదు బహుమతులు 40 కోట్ల డాలర్లు. ఇది మహిళా ఫుట్‌బాల్ టోర్నమెంటు జట్లకు ఇస్తున్న మొత్తం కన్నా పది రెట్లు ఎక్కువ. అందుకే ఇప్పటికీ మహిళల-పురుషుల వేతనాల మధ్య వ్యత్యాసంపై చర్చ జరుగుతోంది.
అమెరికా మహిళల జట్టు విజయంపై ఆ దేశ పురుషుల స్టార్ ప్లేయర్ లాన్డన్ డొనోవన్, టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్, ప్రముఖ వ్యాఖ్యాత ఎలెన్ ప్రశంసలు కురిపించారు.