ప్రపంచ ఫుట్బాల్ పాలకమండలి(ఫిఫా).. పాకిస్థాన్, చడియన్ ఫుట్బాల్ ఫెడరేషన్లపై సస్పెన్షన్ విధించింది. ఈ విషయాన్ని బుధవారం వెల్లడించింది. పాక్ ఫెడరేషన్లో మూడో వ్యక్తి జోక్యం, చడియన్ ఫెడరేషన్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది.
ఈ ఏడాది మార్చి 27న పాక్ ఫుట్బాల్ సమాఖ్య(ఫీఎఫ్ఎఫ్) కార్యాలయంపై దాడి జరిగింది. అందులో ఉన్నవారిని.. ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు సయ్యద్ అస్ఫాక్ హుస్సేన్ షా, అతడి బృందం.. బందీలను చేసింది. దీంతో ఫిఫా స్పందించాల్సి వచ్చింది.
ఇది చదవండి: రొనాల్డో విసిరేసిన చేతి బ్యాండ్కు వేలంలో భారీ ధర