యురోపియన్ ఛాంపియన్‌షిప్‌లో ఇటలీ అదరగొట్టింది. పెనాల్టీ షూటౌట్‌కు దారితీసిన ఈ మ్యాచ్‌లో ఇటలీ తేడాతో 3-2 తేడాతో ఇంగ్లాండ్‌పై గెలిచింది. దీంతో 1968 తర్వాత ఇటలీ యూరోకప్‌ను మరోసారి ముద్దాడింది. లండన్ వేదికగా వెంబ్లే స్టేడియంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్ నిర్ణీత సమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో ఆట ఆదనపు సమయానికి దాసి తీసింది. అదనపు సమయంలో కూడా ఇరు జట్లు గోల్ చేయకపోవడంతో ఇక నిర్ణయాత్మక పెనాల్టీషూటౌట్‌కు మారింది.
ఇటలీ ఆరు అవకాశాల్లో మూడింటిని గోల్స్ చేయగా, ఇంగ్లాండ్ రెండింటిని మాత్రమే గోల్‌గా మలిచింది. దీంతో 55 ఏళ్ల తర్వాత తొలిసారి ఫైనల్‌కు దూసుకొచ్చి కప్పు కొడుదామన్న ఇంగ్లాండ్ ఆశలు ఆవిరయ్యాయి.
ఇక ఆటలో తొలిగోల్ ఇంగ్లాండే చేసినప్పటికీ ఆధిపత్యమంతా ఇటలీదే. ఆట ప్రారంభమైన 2వ నిమిషానికే ఇంగ్లాండ్ ఆటగాడు లూక్ షా గోల్‌చేశాడు. దీంతో ఇంగ్లాండ్ ఆధిక్యంలో వచ్చింది. 67వ నిమిషంలో ఇటలీ ఆటగాడు లియానార్డో బోనుచి గోల్‌చేసి స్కోరును సమం చేశాడు. దీంతో ఆధిపత్యం కోసం ఇరుజట్లు హోరాహోరీగా తలపడ్డాయి. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1తో నిలవడంతో ఆదనపు సమయానికి దారితీసింది. ఇక పెనాల్టీ షూటౌట్‌లో గోల్‌కీపర్ డోనరుమా ఆఖరి బంతిని అద్భుతంగా ఆపి ఇటలీకి విజయాన్నిచ్చాడు.
ఇదీ చదవండి:Euro Cup: 55 ఏళ్ల ఇంగ్లాండ్ కల నిజమయ్యేనా?