మహమ్మారి కరోనా వైరస్‌ను అరికట్టడంలో భాగంగా ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ రూ.8.27 కోట్ల ఆర్థిక సాయం చేశాడు. ఆ డబ్బుని స్పెయిన్ బార్సిలోనాలోని హాస్పిటల్ క్లినిక్, తన సొంతదేశం అర్జెంటీనాలోని వైద్య కేంద్రం వినియోగించుకోనున్నాయి.
-
Doing his bit to help #coronavirus situation. #WeAreMessi pic.twitter.com/p542kKKpL2
— Leo Messi 🔟 (@WeAreMessi) March 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Doing his bit to help #coronavirus situation. #WeAreMessi pic.twitter.com/p542kKKpL2
— Leo Messi 🔟 (@WeAreMessi) March 25, 2020Doing his bit to help #coronavirus situation. #WeAreMessi pic.twitter.com/p542kKKpL2
— Leo Messi 🔟 (@WeAreMessi) March 25, 2020
'కరోనాపై పోరాడేందుకు క్లినిక్‌కు సాయం చేసినందుకు మెస్సీకి కృతజ్ఞతలు' అని హాస్పిటల్ క్లినిక్ ట్వీట్ చేసింది. బార్సిలోనా మేనేజర్, మాజీ ప్లేయర్ అయిన పెప్ గార్డియోలా కూడా అదే మొత్తంలో ఏంజెల్ సోలర్ డేనియల్ ఫౌండేషన్, బార్సిలోనా మెడికల్ కాలేజ్‌కు సాయం చేశాడు.
'కొవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కోవటానికి పెప్ గార్డియోలా ఆరోగ్య పరికరాల కోసం ఏంజెల్ సోలర్ డేనియల్ ఫౌండేషన్‌కు ఒక మిలియన్ యూరోలు సాయం చేశారు' అని మెడికల్ కాలేజ్ తెలిపింది. చైనా, ఇటలీ తర్వాత స్పెయిన్‌లోనే కరోనా తీవ్రత అధికంగా ఉంది.