ETV Bharat / sports

Yuvraj singh: మరో విదేశీ లీగ్​లో యువరాజ్ సింగ్ - యువరాజ్​ సింగ్

మెల్​బోర్న్ క్రికెట్ క్లబ్ మల్​గ్రేవ్ తరఫున ఆడేందుకు స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సిద్ధమవుతున్నాడు. ఆ విషయాన్ని జట్టు ప్రెసిడెంట్ మిలాన్​​ తెలిపారు. వీరితో పాటు గేల్, లారా, డివిలియర్స్​ కూడా ఆడనున్నారట.

yuv raj and gayle
యువరాజ్, గేల్
author img

By

Published : Jun 27, 2021, 1:25 PM IST

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్.. మెల్​బోర్న్ క్రికెట్ క్లబ్ మల్​గ్రేవ్ జట్టు తరఫున ఆడనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్​తోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు ముల్​గ్రేవ్ అధ్యక్షుడు మిలాన్​ పుల్లెనయేగమ్​ తెలిపారు.

Yuvraj
యువరాజ్ సింగ్
Gayle
క్రిస్ గేల్

" ఇప్పటికే శ్రీలంక క్రికెటర్లు దిల్షాన్​, సనత్ జయసూర్య, తరంగాలు మల్​గ్రేవ్ జట్టులో ఆడనున్నారు. ఇంకొంత మంది సమర్థమంతమైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకునేందుకు కృషి చేస్తున్నాం. మల్​గ్రేవ్ జట్టులో ఆడేందుకు యువరాజ్, గేల్​లు దాదాపు సుముఖంగా ఉన్నారు" అని మిలాన్ చెప్పారు.

అయితే ఈ విషయంపై యువరాజ్, గేల్​ల నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. ఈ ఏడాది జనవరిలో దుబాయ్​లో జరిగిన టీ10 లీగ్​లో మరాఠా అరేబియన్స్ జట్టు తరఫున ఆడాడు యువరాజ్ సింగ్.

ఇదీ చదవండి : Amit Panghal: ప్రపంచ నెం.1 స్థానంతో ఒలింపిక్స్​కు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.