దేశంలో రెండో దశ కరోనా నానాటికీ ప్రాణాంతకంగా మారుతోన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కోరారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్లు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. వారిలో సారథి విరాట్ కోహ్లీ సహా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ యాజమాన్యం తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
-
Stay Home. Stay Safe.
— Royal Challengers Bangalore (@RCBTweets) April 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
The only way to beat the Coronavirus pandemic is by working as a team. Each one of us is a superhero and all we need to do is follow the basics and help each other. Here’s Virat Kohli and Co. with a public service announcement.#PlayBold #StayHomeStaySafe pic.twitter.com/jQT9q15N5j
">Stay Home. Stay Safe.
— Royal Challengers Bangalore (@RCBTweets) April 25, 2021
The only way to beat the Coronavirus pandemic is by working as a team. Each one of us is a superhero and all we need to do is follow the basics and help each other. Here’s Virat Kohli and Co. with a public service announcement.#PlayBold #StayHomeStaySafe pic.twitter.com/jQT9q15N5jStay Home. Stay Safe.
— Royal Challengers Bangalore (@RCBTweets) April 25, 2021
The only way to beat the Coronavirus pandemic is by working as a team. Each one of us is a superhero and all we need to do is follow the basics and help each other. Here’s Virat Kohli and Co. with a public service announcement.#PlayBold #StayHomeStaySafe pic.twitter.com/jQT9q15N5j
"హాయ్.. నేను విరాట్ కోహ్లీ. ఒక కెప్టెన్‌గా నేను ముందుండి నడిపిస్తాను. చుట్టూ ఉన్నవాళ్లకు సహకరిస్తాను. మీరందరు కూడా అలాగే చేయాలని కోరుతున్నా. చేతులను శుభ్రపరచుకోండి. అవసరమైతేనే బయటకు వెళ్లండి. అన్ని వేళలా మాస్కులు ధరించండి."
- విరాట్ కోహ్లీ, ఆర్సీబీ కెప్టెన్
సూపర్ హీరోలా..
భారత్‌లో ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 3,49,691 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 2,767 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో మనమే సూపర్‌హీరోలా ఉండి, వైరస్ నుంచి బయటపడాలని కోరాడు ఏబీడీ.
"హాయ్.. నేను ఏబీ డివిలియర్స్. ఆపత్కాలంలో సూపర్‌హీరో కోసం ఎదురుచూడలేం. మీరే సూపర్‌హీరోగా మారాలి. మహమ్మారి వేళ ఇంట్లో ఉండటం ద్వారానే సురక్షితంగా ఉండగలం. అందరం కలిసికట్టుగా దీని నుంచి బయటపడదాం."
- ఏబీ డివిలియర్స్
"మీకు వినోదం, సంతోషాన్ని ఇవ్వడమే మా ప్రాధాన్యం. బదులుగా, అందరూ జాగ్రత్తగా ఉండి, కొవిడ్‌ను జయించాలని కోరుతున్నా." అని మ్యాక్స్‌వెల్ అన్నాడు.
ఇదీ చూడండి: సీఎస్కేxఆర్సీబీ: ఆధిపత్యం కొనసాగించేది ఎవరో?