ETV Bharat / sports

ఫస్ట్​ క్లాస్​ ప్లేయర్లకు 'రంజీ' పరిహారం ఎప్పుడో? - బీసీసీఐ

కొవిడ్ కారణంగా రద్దైన 2020 రంజీ ట్రోఫీకి సంబంధించి బీసీసీఐ ప్రకటించిన పరిహారం.. భారత ఫస్ట్​క్లాస్​ క్రికెటర్లకు అందలేదు. రాష్ట్రాల నుంచి అందాల్సిన ప్రణాళిక అందని కారణంగానే చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు.​

bcci, compensation promise
బీసీసీఐ, రంజీ ట్రోఫీ పరిహారం
author img

By

Published : May 24, 2021, 7:17 PM IST

2020కి సంబంధించి భారత ఫస్ట్​క్లాస్​ క్రికెటర్లకు ప్రకటించిన పరిహారం ఇంకా అందించలేదు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ). అందుకు సంబంధించిన ప్రణాళిక రాష్ట్రాల నుంచి రాకపోవడమే చెల్లింపులు ఆలస్యమవ్వడానికి కారణమని బీసీసీఐ కోశాధికారి​ అరుణ్ ధుమాల్ వెల్లడించారు.

"మేము రాష్ట్రాలతో చర్చించాల్సి ఉంది. ఎందుకంటే ఎవరెన్ని మ్యాచ్​లు ఆడారు? ఎన్ని మ్యాచ్​లు జరిగాయి? రిజర్వ్​లో ఉన్న ఆటగాళ్ల సంఖ్య ఎంత? అనే విషయాల గురించి రాష్ట్రాలు సమాచారం పంపాల్సి ఉంది. కానీ, ఇంతవరకు ఏ ఒక్క రాష్ట్రం ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు పంపలేదు. అందుకే చెల్లింపులు ఆలస్యమయ్యాయి" అని అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు.

కొవిడ్ కారణంగా గతేడాది జరగాల్సిన రంజీ ట్రోఫీ రద్దైంది. దీంతో ఫస్ట్​ క్లాస్​ ఆటగాళ్లకు పరిహార ప్యాకేజీ ప్రకటించింది బీసీసీఐ.

గతేడాది ఆసీస్​లో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్​కు సంబంధించి.. భారత క్రికెటర్లకు రావాల్సిన రన్నరప్​ ప్రైజ్​మనీ గురించి ఇటీవల వార్తలు వెలువడ్డాయి. త్వరలోనే ఆ ప్రైజ్​మనీని వారి ఖాతాల్లోకి చేరవేస్తామని బోర్డు తెలిపింది. దీంతో ఈ విషయం బయటపడింది.

ఇదీ చదవండి: త్వరలోనే వారికి ప్రపంచకప్ ప్రైజ్​మనీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.