గత కొంత కాలంగా టెస్టుల్లో స్థిరమైన ప్రదర్శనలిస్తున్నాడు రిషభ్ పంత్. రానున్న ఇంగ్లాండ్ పర్యటనలో పంతే తన మొదటి ప్రాధాన్య వికెట్ కీపర్ అని తెలిపాడు భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహా.
"ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు ముందు జరిగిన గత సిరీస్‌ల్లో పంత్ అద్భుతంగా ఆడాడు. వికెట్ కీపర్‌గా నా మొదటి ప్రాధాన్యం అతడికే. జట్టులో స్థానం కోసం నేను వేచిచూస్తాను. ఏదైనా అవకాశం వస్తే సద్వినియోగం చేసుకుంటాను. ఆ ఒక్క ఛాన్స్ కోసం నేను సాధన మొదలెట్టాను. జట్టులో చోటు ఉన్నా.. లేకున్నా నా దృక్పథం మారదని" సాహా తెలిపాడు. తనను తాను మెరుగుపరుచుకోవడానికే ఎల్లప్పుడూ ప్రయత్నిస్తానని సాహా చెప్పుకొచ్చాడు. ప్రాక్టీస్ సెషన్‌కు నిజమైన మ్యాచ్‌కు చాలా తేడా ఉందని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: 'డబ్ల్యూటీసీ' ఆడితే కోహ్లీ కొత్త రికార్డ్
జట్టులోకి మూడో కీపర్‌ను ఎంపిక చేయడంపై సాహా స్పందించాడు. ప్రస్తుత కొవిడ్ తరుణంలో టీమ్‌లో అదనపు కీపర్ అవసరమని అభిప్రాయపడ్డాడు. "ఇంతకుముందు ఒకరికి ఏదైనా అయితే మరొకరు కీపింగ్ బాధ్యతలు చేపట్టేవారు. ఇప్పుడు కరోనా ప్రభావం అత్యధికంగా ఉంది. దీంతో మరో కీపర్ అవసరం" అని సాహా వెల్లడించాడు.
2010లో దక్షిణాఫ్రికాపై తన టెస్టు అరంగేట్రం చేసిన పంత్.. ఇప్పటి వరకు 38 టెస్టులాడాడు. వాటిల్లో 3 సెంచరీలు కాగా.. మరో 5 అర్ధ శతకాలు చేశాడు. కీపింగ్‌లో అత్యుత్తమంగా రాణిస్తూ వచ్చిన సాహా.. బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఆస్ట్రేలియా పర్యటనలోనూ పింక్ బాల్ టెస్టులో విఫలమైన సాహా స్థానంలో అనూహ్యాంగా జట్టులోకి వచ్చాడు పంత్. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రిషభ్.. జట్టుకు అద్భుత విజయాలు అందించాడు. తర్వాతి ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనూ టీమ్ఇండియా 3-1తో గెలుపొందింది.
ఇదీ చదవండి: 'ఐపీఎల్ నుంచి నేనే వెళ్లిపోదామనుకున్నా'