ETV Bharat / sports

WTC Final: టీమ్ఇండియా 170 ఆలౌట్​- కివీస్​ లక్ష్యం 139

సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్​తో జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్​ రెండో ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా 170 పరుగులకు ఆలౌటైంది. 41 పరుగులు చేసిన రిషభ్ పంత్ భారత జట్టులో టాప్​ స్కోరర్.​ కివీస్ బౌలర్లలో సౌథీ 4, బౌల్ట్​ 3, జేమీసన్ 2, వాగ్నర్​ ఒక వికెట్ తీసుకున్నారు.

wtc final, india vs new zealand
డబ్ల్యూటీసీ ఫైనల్, ఇండియా vs న్యూజిలాండ్
author img

By

Published : Jun 23, 2021, 7:11 PM IST

సౌథాంప్టన్​ వేదికగా కివీస్​తో జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్​లో 170 పరుగులకు ఆలౌటైంది. రిషభ్​ పంత్​(41), రోహిత్ శర్మ(30) రాణించారు. కివీస్ బౌలర్లలో సౌథీ 4, బౌల్ట్​ 3, జేమీసన్ 2, వాగ్నర్​ ఒక వికెట్ తీసుకున్నారు. న్యూజిలాండ్​ను విజయం వరించాలంటే 55 ఓవర్లలో 139 పరుగులు చేయాలి.

130/5తో భోజన విరామానికి వెళ్లిన టీమ్​ఇండియా.. స్కోరు బోర్డుకు మరో 12 పరుగులు జోడించాక జడేజా(49 బంతుల్లో 16 పరుగులు) వికెట్​ను కోల్పోయింది. వాగ్నర్​ బౌలింగ్​ను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడ్డ జడ్డూ.. అతని బౌలింగ్​లో​ క్యాచ్ ఔట్​​గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అశ్విన్ డిఫెన్స్​కు ప్రాధాన్యమిచ్చాడు. పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డ పంత్​.. బౌల్ట్​ బౌలింగ్​లో ఓ భారీ షాట్​కు ప్రయత్నించి ఔటయ్యాడు. రిషభ్ ఔట్​ తర్వాత అశ్విన్​ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. అదే ఓవర్లో పెవిలియన్​ చేరాడు.

తర్వాత వచ్చిన టెయిలెండర్లు త్వరగానే ఔటయ్యారు. దీంతో 170 పరుగుల వద్ద భారత్ ఇన్నింగ్స్​కు తెరపడింది.

గాయంతోనే..

కెరీర్​లో చివరి మ్యాచ్​ ఆడుతోన్న కివీస్ కీపర్​ వాట్లింగ్​.. గాయంతోనే మ్యాచ్​లో పాల్గొన్నాడు. తొలి సెషన్​లో అతని కుడి ఉంగరపు వేలుకు గాయమైంది. దీంతో లంచ్​ సమయంలో చికిత్స తీసుకున్న వాట్లింగ్​.. తిరిగి మైదానంలోకి వచ్చాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.