ETV Bharat / sports

WTC Final: బౌల్ట్ బౌలింగ్​లో రోహిత్ ఎలా ఆడతాడో? - జడేజాపై సెహ్వాగ్ వ్యాఖ్యలు

జూన్​ 18 నుంచి సౌథాంప్టన్ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్​పై స్పందించాడు మాజీ డాషింగ్ ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్. ఈ ఆసక్తికర పోరులో ట్రెంట్​ బౌల్ట్​ బౌలింగ్​ను టీమ్ఇండియా ఓపెనర్​ రోహిత్​ శర్మ ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా మారిందని తెలిపాడు. అలాగే మరికొన్ని విషయాలు అతడి మాటల్లోనే..

virendra sehwag, former indian cricketer
వీరేంద్ర సెహ్వాగ్, మాజీ క్రికెటర్
author img

By

Published : Jun 12, 2021, 5:35 PM IST

మరో వారం రోజుల్లో న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో రోహిత్‌ శర్మ.. ట్రెంట్‌ బౌల్ట్‌ను ఎలా ఎదుర్కొంటాడో చూడాలని ఉందని మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా పీటీఐతో మాట్లాడిన డాషింగ్‌ ఓపెనర్‌.. టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌పై తన అభిప్రాయాలు వెల్లడించాడు. బౌల్ట్‌, రోహిత్‌ మధ్య ఆసక్తికర పోరు జరుగుతుందని, అందుకోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. వీరూ ఇంకా ఏం చెప్పాడో అతడి మాటల్లోనే..

రోహిత్‌ ఆట కోసం ఎదురుచూస్తున్నా..

WTC Final: I will be looking forward to Boult vs Rohit contest, says Sehwag
రోహిత్ శర్మ

"ట్రెంట్‌ బౌల్ట్‌, టిమ్‌ సౌథీ భారత జట్టుకు సవాళ్లు విసురుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. వాళ్లిద్దరూ బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేస్తారు. దాంతో రోహిత్‌.. బౌల్ట్‌ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తిగా ఉంటుంది. అందుకోసం నేను ఎదురుచూస్తున్నా. రోహిత్‌ అద్భుతమైన ఆటగాడు. 2014లోనూ ఇంగ్లాండ్‌లో టెస్టులు ఆడాడు. దీంతో ఈసారి అక్కడ రాణిస్తాడనే నమ్మకముంది. ఇటీవలి కాలంలో ఓపెనర్‌గానూ అతడు బాగా ఆడుతున్నాడు. కానీ, ఇతర ఓపెనర్ల లాగే తొలి పది ఓవర్లు జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. బంతి ఎలా వస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాలను ముందే గ్రహించాలి. ఇక తర్వాత తనదైన శైలిలో షాట్లు ఆడుతూ పరుగులు చేస్తాడని కచ్చితంగా చెబుతాను"

-వీరేంద్ర సెహ్వాగ్, మాజీ క్రికెటర్.

పంత్‌.. ఎవరి గురించి పట్టించుకోకు..

రిషభ్ పంత్

"పంత్‌ బ్యాటింగ్‌ గురించి అతడికే స్పష్టమైన అవగాహన ఉంది. ఇతరులు ఏమనుకుంటున్నారనే విషయాలను పట్టించుకోకుండా తన ఆట మీదే దృష్టిసారించాలి. బ్యాటింగ్‌ చేసేటప్పుడు ఒక్కొక్క బంతి గురించే ఆలోచించాలి. ఒక బంతిని షాట్‌ ఆడాలనిపిస్తే ధైర్యంగా ఆడాలి. తన బ్యాటింగ్‌ శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తన ఆటతో అందర్నీ ఆకట్టుకున్నాడు. జట్టులో తన స్థానమేంటో అర్థం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియాలో కీలక ఆటగాడిగా మారాడు. ఆరో స్థానంలో బరిలోకి వచ్చి త్వరగా పరుగులు చేస్తుంటే ఒకే సెషన్‌లో మ్యాచ్‌ను మలుపు తిప్పుతాడు" అని వివరించాడు.

ఇదీ చదవండి: Shakib: షకిబ్​ను విలన్‌గా చూపిస్తున్నారు

స్ట్రైక్‌రేట్‌తో అనవసరం..

ఛెతేశ్వర్ పుజారా

"టెస్టు క్రికెట్‌లో స్ట్రైక్‌రేట్‌ గురించి ఆలోచించాల్సిన పని లేదు. నేను టీమ్‌ఇండియాకు ఆడే రోజుల్లో నా వెనకాల రాహుల్‌ ద్రవిడ్‌, గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌ బ్యాటింగ్‌ చేసేవాళ్లు. వాళ్లంతా ఈ ఫార్మాట్‌లో 50 స్ట్రైక్‌రేట్‌తోనే కొనసాగారు. ఇక్కడ అసలైన విషయం ఏమిటంటే క్రీజులో పాతుకుపోవడం. అందుకోసం పరుగులు చేస్తూ భాగస్వామ్యాలు నిర్మించాలి. కాబట్టి.. పుజారా విషయంలో జట్టుకు పరుగులు చేస్తున్నంత కాలం నేను సంతోషంగానే ఉంటా. అక్కడ స్ట్రైక్‌రేట్‌ గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు" అని మాజీ బ్యాట్స్‌మన్‌ చెప్పుకొచ్చాడు.

వారిద్దరూ ఉండాలి..

రవిచంద్రన్ అశ్విన్

చివరగా టీమ్‌ఇండియా బౌలింగ్‌ యూనిట్‌పై మాట్లాడుతూ.. 'జూన్‌ 18న పిచ్‌ ఎలా ఉంటుందో నాకు తెలీదు. అయితే, నేనెప్పుడూ ఒక విషయాన్ని బలంగా నమ్ముతా. పూర్తి బలమైన జట్టుతో ఆడాలి. టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌లో ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలి. అందులో ఇద్దరు స్పిన్నర్లు ఉంటే నాలుగు, ఐదు రోజుల్లో జట్టుకు కలిసి వస్తుంది. ఈ విషయంలో అశ్విన్‌, జడేజా సరైన ఆటగాళ్లు. వాళ్లు బ్యాటింగ్‌లోనూ ప్రభావం చూపుతారు. అప్పుడు ఆరో బ్యాట్స్‌మెన్‌ కూడా అవసరముండదు' అని వీరూ వివరించాడు.

ఇదీ చదవండి: 'దుస్రా కాదు క్యారమ్​ బాల్​ నా ప్రధాన అస్త్రం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.