సౌథాంప్టన్ వేదికగా జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమ్ఇండియా అభిమానులకు వింత అనుభవం ఎదురైంది. తమిళ హీరో అజిత్ 'వాలిమై' సినిమా అప్డేట్స్ అడుగుతూ ఓ వ్యక్తి ఫ్లకార్డు చూపించాడు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
యాక్షన్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న 'వాలిమై' కోసం అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఏడాది కాలంగా షూటింగ్ జరుగుతోంది. కరోనా ప్రభావం చిత్రీకరణ పడుతూ, లేస్తూ ఉండటం వల్ల అప్డేట్స్ రావడం లేదు. దీంతో సందర్భం వచ్చిన ప్రతిసారి ఇలా వాలిమై అప్డేట్స్ కావాలంటూ అభిమానులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇండియా-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ సందర్భంగా అశ్విన్‌తో పాటు మొయిన్ అలీని ఇదే సినిమా గురించి ఫ్యాన్స్ అడిగారు.
-
#ValimaiUpdate 😀#ThalaAjith #Valimai #Ajithkumar #WTCFinal21 #INDvsNZ #Thala pic.twitter.com/vM53SwONOT
— TRENDS AJITH | ᴡᴇᴀʀ ᴍᴀꜱᴋ - ꜱᴛᴀʏ ꜱᴀꜰᴇ (@TrendsAjith) June 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#ValimaiUpdate 😀#ThalaAjith #Valimai #Ajithkumar #WTCFinal21 #INDvsNZ #Thala pic.twitter.com/vM53SwONOT
— TRENDS AJITH | ᴡᴇᴀʀ ᴍᴀꜱᴋ - ꜱᴛᴀʏ ꜱᴀꜰᴇ (@TrendsAjith) June 20, 2021#ValimaiUpdate 😀#ThalaAjith #Valimai #Ajithkumar #WTCFinal21 #INDvsNZ #Thala pic.twitter.com/vM53SwONOT
— TRENDS AJITH | ᴡᴇᴀʀ ᴍᴀꜱᴋ - ꜱᴛᴀʏ ꜱᴀꜰᴇ (@TrendsAjith) June 20, 2021
-
Fans Asking #ValimaiUpdate From England Cricket Stadium 💥💥#Valimai | #Thala | #AjithKumar pic.twitter.com/56CtfISvDe
— 𝗢𝗡𝗟𝗜𝗡𝗘 𝗔𝗙𝗖 𝗠𝗔𝗗𝗨𝗥𝗔𝗜 (@AjithFCMadurai) June 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Fans Asking #ValimaiUpdate From England Cricket Stadium 💥💥#Valimai | #Thala | #AjithKumar pic.twitter.com/56CtfISvDe
— 𝗢𝗡𝗟𝗜𝗡𝗘 𝗔𝗙𝗖 𝗠𝗔𝗗𝗨𝗥𝗔𝗜 (@AjithFCMadurai) June 20, 2021Fans Asking #ValimaiUpdate From England Cricket Stadium 💥💥#Valimai | #Thala | #AjithKumar pic.twitter.com/56CtfISvDe
— 𝗢𝗡𝗟𝗜𝗡𝗘 𝗔𝗙𝗖 𝗠𝗔𝗗𝗨𝗥𝗔𝗜 (@AjithFCMadurai) June 20, 2021
అడ్డుపడుతున్న వరుణుడు..
ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. నాలుగో రోజు కూడా వర్షం పడుతోంది. దీంతో ఆట తొలిసెషల్ ఇంకా ప్రారంభమే కాలేదు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా, తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది.
అంతకు ముందు వర్షం కారణంగా తొలి రోజు కనీసం ఒక్క బంతి పడకుండానే ఆట రద్దయింది. వెలుతురులేమీ కారణంగా తర్వాతి రెండు రోజులు ఆట పూర్తిగా జరగలేదు. నాలుగో రోజు ఆట కొనసాగేది అనుమానంగానే కనబడుతోంది.
ఇదీ చదవండి: 'వాలిమై' సినిమా గురించి మొయిన్ అలీ ఆరా!