ETV Bharat / sports

WTC Final: రిజర్వ్ డే ఉంటుందా? ఉండదా?

author img

By

Published : Jun 19, 2021, 5:30 AM IST

ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ మ్యాచ్​ తొలి రోజు కనీసం టాస్ పడకుండానే వృథా అయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ఔట్​ ఫీల్డ్​ తడిగా మారింది. దీంతో గత్యంతరం లేక మ్యాచ్​ను తదుపరి రోజుకు వాయిదా వేశారు అంపైర్లు. ఈ తరుణంలో కీలకంగా మారిన రిజర్వ్​ డేను ఎలా వాడుకోనున్నారు. ఐసీసీ నిబంధనలు ఏం చెప్తున్నాయో ఓ సారి చూద్దాం.

WTC final, Call on Reserve Day
రిజర్వ్ డే, డబ్ల్యూటీసీ ఫైనల్

సుదీర్ఘ ఫార్మాట్​లో ప్రపంచకప్​గా భావిస్తున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్​షిప్​ ఫైనల్​ మ్యాచ్​ తొలి రోజు వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. కనీసం టాస్​ కూడా పడకుండానే మ్యాచ్​ను తర్వాతి రోజుకు వాయిదా వేస్తున్నట్లు ఫీల్డ్ అంపైర్లు ప్రకటించారు. ఒక రోజు ఆట పూర్తిగా వృథా కావడం వల్ల ఇప్పుడు అందరి కళ్లు రిజర్వ్​ డే మీద పడింది. అయితే ఈ రిజర్వ్​ డేను ఎలా వాడుతారు. దీని విషయంలో ఐసీసీ గతంలో విడుదల చేసిన మార్గదర్శకాలు ఎలా ఉన్నాయనేది ఓ సారి చూద్దాం.

వర్షం వల్ల మొదటి రోజు ఆటలో ఒక్క బంతి కూడా పడలేదు. అయితేనేం రిజర్వ్ డే ఉందిగా అని అభిమానులతో పాటు పలువురు అభిప్రాయపడుతుండొచ్చు. కానీ, వృథా అయిన మొత్తం రోజుకు రిజర్వ్​ డేను కేటాయించరు. కేవలం ఫలితం వస్తుందనుకున్న సందర్భంలో లేదా రోజువారీగా ఎన్ని ఓవర్లు తక్కువగా వేశారో అంత మేరకు ఆట సాగడానికి ఈ అదనపు రోజును వాడుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ అదనపు రోజు అనేది పూర్తి ఐదు రోజులకు సంబంధించింది. అది కూడా నిర్వాహకులు అవసరమని భావిస్తేనే అది అమల్లోకి వస్తుంది. లేదంటే మ్యాచ్​ను డ్రా లేదా టైగా ప్రకటించే అవకాశం ఉంటుంది.

ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను 2018 జూన్​లోనే విడుదల చేసింది ఐసీసీ. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి.. మరి కొద్ది సమయం ఉంటే ఫలితం వస్తుందని భావించినప్పుడు ఈ రిజర్వ్​ డేను ఉపయోగించుకుంటారు. అంటే కొన్ని ఓవర్ల మేర ఆరో రోజును వాడొచ్చేమో కానీ, మొత్తం ఓవర్లకు వాడడం కుదరదన్న మాట! అది కూడా ఐదో రోజు ఆట పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

క్రీడాలోకం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన డబ్ల్యూటీసీ ఫైనల్​ మ్యాచ్​ను నిర్వహించడానికి పలుమార్లు అంపైర్లు ప్రయత్నించారు. పిచ్​పై కవర్లు తొలగించే సమయానికే మళ్లీ వర్షం రావడం వల్ల సమయం వృథా అయింది. ఏకధాటిగా కురిసిన వర్షం వల్ల ఔట్​ ఫీల్డ్​ చిత్తడిగా మారింది. దీంతో పలుమార్లు వికెట్​ను పరిశీలించిన అంపైర్లు చివరికి ఆటను తర్వాతి రోజుకు వాయిదా వేశారు.

ఇదీ చదవండి: Sachin Tendulkar: 'నేను కొవిడ్ జయించడానికి వాళ్లే కారణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.