ETV Bharat / sports

WTC ఓటమి ఎఫెక్ట్‌.. పుజారా, ఉమేశ్‌పై వేటు?.. రింకు, యశ్వసికి చోటు! - బీసీసీఐ డబ్ల్యూటీసీ ఫైనల్​

WTC Final BCCI : వరుస రెండో సారి ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​ షిప్​ ఫైనల్​లో టీమ్​ఇండియా ఓడిపోవడాన్ని బీసీసీఐ సీరియస్​గా తీసుకుంది! దిద్దబాటు చర్యల్లో భాగంగా గత కొద్దికాలంగా పేలవ ప్రదర్శన ఇస్తున్న ఆటగాళ్లుపై వేటు వేసేందుకు సిద్ధమయ్యిందట. త్వరలో ప్రారంభం కాబోయే భారత్​ - విండీస్​ సిరీస్​లో సమూల మార్పులు చేయాలని భావిస్తోందట.

pujara umesh
pujara umesh
author img

By

Published : Jun 12, 2023, 8:41 PM IST

Updated : Jun 12, 2023, 9:22 PM IST

WTC Final BCCI : వరుస రెండో సారి ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​ షిప్​ ఫైనల్​లో టీమ్​ఇండియా ఓడిపోవడాన్ని బీసీసీఐ సీరియస్​గా తీసుకుంది! దిద్దబాటు చర్యల్లో భాగంగా గత కొద్దికాలంగా పేలవ ప్రదర్శన ఇస్తున్న ఆటగాళ్లపై వేటు వేసేందుకు సిద్ధమయ్యిందట. త్వరలో ప్రారంభం కాబోయే భారత్​ - విండీస్​ సిరీస్​లో సమూల మార్పులు చేయాలని భావిస్తోందట.

టెస్ట్​ స్పెషలిస్ట్​గా పేరుగాంచిన ఛెతేశ్వర్​ పుజారా, బౌలర్​ ఉమేశ్​ యాదవ్​పై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి స్థానంలో యంగ్​ ప్లేయర్లు యశస్వి జైస్వాల్​, ముకేశ్​ కుమార్​లను బీసీసీఐ ఎంపిక చేసే అవకాశం ఉందట. దీంతో పాటు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనూ పలు మార్పులకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ 16వ సీజన్​ ప్రదర్శనల ఆధారంగా పలు ఎంపికలు జరగవచ్చని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

టీ20ల్లో రింకూ సింగ్‌, యశస్వి జైస్వాల్‌, జితేశ్‌ శర్మ, రుతురాజ్‌ గైక్వాడ్‌, శివమ్‌ దూబే, మోహిత్‌ శర్మలకు దాదాపుగా ఛాన్స్‌ దక్కవచ్చని తెలుస్తోంది. విండీస్‌ టూర్‌లో సీనియర్ల గైర్హాజరీలో వీరికి వీలైనన్ని అవకాశాలు ఇవ్వాలని బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే విండీస్‌ టూర్‌లో వన్డేల కోసం పలువురు ఆటగాళ్లను ప్రత్యేకంగా ఎంపిక చేయవచ్చన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ లిస్ట్‌లో శిఖర్‌ ధావన్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ధావన్‌కు వయసు పైబడుతుండటంతో వరల్డ్‌కప్‌కు ముందు వీలైనన్ని అవకాశాలు కల్పించాలన్నది బీసీసీఐ ఆలోచనట.

India Vs West Indies : కాగా, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌ కోసం భారత క్రికెట్​ జట్టు.. జులై 12 నుంచి వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్‌ తొలుత టెస్ట్‌లు, ఆ తర్వాత వన్డేలు, టీ20లు ఆడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ సోమవారం రాత్రి విడుదల చేసింది.

విండీస్‌ పర్యటన వివరాలు..

  • తొలి టెస్ట్‌- జులై 12-16, విండ్సర్ పార్క్‌, డొమినికా
  • రెండో టెస్ట్‌- జులై 20-24, క్వీన్స్ పార్క్ ఓవల్‌, ట్రినిడాడ్‌
  • జులై 27- తొలి వన్డే, కెన్సింగ్​టన్​ ఓవల్​, బార్బడోస్​
  • జులై 29- రెండో వన్డే, కెన్సింగ్​టన్​ ఓవల్​, బార్బడోస్​
  • ఆగస్ట్‌ 1- మూడో వన్డే, బ్రెయిన్ లారా క్రికెట్​ అకాడమీ, ట్రినిడాడ్‌
  • ఆగస్ట్‌ 3- తొలి టీ20, బ్రెయిన్ లారా క్రికెట్​ అకాడమీ, ట్రినిడాడ్‌
  • ఆగస్ట్‌ 6- రెండో టీ20, నేషనల్​ స్డేడియం, గయానా
  • ఆగస్ట్‌ 8- మూడో టీ20, నేషనల్​ స్డేడియం, గయానా
  • ఆగస్ట్‌ 12- నాలుగో టీ20, బ్రౌవార్డ్​ కౌంటీ స్డేడియం, ఫ్లోరిడా
  • ఆగస్ట్‌ 13- ఐదో టీ20, బ్రౌవార్డ్​ కౌంటీ స్డేడియం, ఫ్లోరిడా

జియో సినిమాలో ఫ్రీగా భారత్​- విండీస్​ సిరీస్​
Jiocinema India Vs West Indies : అయితే భారత్‌-వెస్టిండీస్‌ సిరీస్‌ను జియో సినిమాలో ఉచితంగా వీక్షించవచ్చని ప్రకటించింది. జులై 12- ఆగస్ట్‌ 13 వరకు జరిగే ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లకు ఇది వర్తిస్తుందని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ అధినేత ఆకాశ్‌ అంబానీ వెల్లడించారు. దీంతో టీమ్​ఇండియా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. థ్యాంక్స్​ టు జియో అంటూ నెట్టింట సందడి చేస్తున్నారు.

Last Updated : Jun 12, 2023, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.