ETV Bharat / sports

అతను సెంచరీ బాదితే టీమ్​ఇండియాదే విజయం.. ఇదిగో ప్రూఫ్​! - WTC final 2023

డబ్ల్యూటీసీ ఫైనల్​ ముందు క్రికెట్ అభిమానులకు ఓ వార్త ఆనందాన్నిస్తోంది. టీమ్​ఇండియా ఆ ప్లేయర్​ సెంచరీ సాధిస్తే భారత జట్టుకు తిరుగుండదు. విజయం పక్కాగా మనదే అవుతుంది. ఆ ప్లేయర్ ఎవరంటే?

rahancentury
రహానె సెంచరీ
author img

By

Published : Jun 6, 2023, 8:38 PM IST

Updated : Jun 7, 2023, 7:13 AM IST

WTC final 2023 Ind vs Aus : క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరల్డ్‌ టెస్ట్‌ ఛాం‍పియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌ మరి కొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. జూన 7న మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటికే ఇరు జట్లు మ్యాచ్​ వేదికైన ఇంగ్లాండ్ చేరుకుని అక్కడ కసరత్తులు చేస్తన్నారు.​ పేస్​కు అనుకూలించే ఈ పిచ్​పై మన బ్యాటర్లు ఎలా ఆడతారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు ముందు ఓ ఆసక్తికర సోషల్​మీడియాలో వైరలవుతోంది. ఈ విషయం ముఖ్యంగా భారత అభిమానులను తెగ సంతోషానిస్తోంది. అదేంటంటే.. టీమ్​ఇండియా బ్యాటర్‌ అజింక్య రహానే టెస్ట్‌ల్లో సెంచరీ చేసిన ప్రతిసారి టీమ్​ఇండియా ఓడిపోలేదు. అతడు తన టెస్ట్‌ కెరీర్‌లో 12 సెంచరీలు నమోదు చేయగా.. వాటిలో టీమ్​ఇండియా 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది.

WTC final 2023 Rahaney : రహానే శతకం బాదిన గత ఐదు సందర్భాల్లో టీమ్​ఇండియా ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ సెంటిమెంటే ప్రస్తుతం టీమ్​ఇండియా అభిమానులను సంతోషానికి గురి చేసింది. ఐపీఎల్‌ 2023లో బాగానే రాణించి.. దాదాపు ఏడాదిన్నర తర్వాత తిరిగి భారత జట్టులోకి అడుగుపెట్టాడు రహానే. ఇప్పుడు తన ఐపీఎల్‌ ఫామ్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్లో కొనసాగిస్తే జట్టుకు కలిసొస్తుంది. అతడు సెంచరీ చేయాలని ఫ్యాన్స్‌ బలంగా ఆశిస్తున్నారు. ఇదే కనుక జరిగితే టీమ్​ఇండియా గెలుపు ఖాయమని ధీమాగా ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

rahancentury
రహానే గణాంకాలు

WTC final 2023 Squad :

టీమ్​ఇండియా జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్‌ పుజారా, రవిచంద్రన్ అశ్విన్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, అజింక్య రహానె, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్‌, ఉమేశ్ యాదవ్.
స్టాండ్‌బై ఆటగాళ్లు : యశస్వి జైస్వాల్, ముఖేశ్‌ కుమార్‌, సూర్యకుమార్‌ యాదవ్.

ఆస్ట్రేలియా జట్టు : పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్ (వైస్‌ కెప్టెన్‌), స్కాట్ బోలాండ్, అలెక్స్ కెరీ (వికెట్ కీపర్‌), కామెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌ కీపర్‌), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, టాడ్ మర్ఫీ, మైఖేల్ నేసర్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్.
స్టాండ్‌బై ఆటగాళ్లు : మిచెల్ మార్ష్, మాట్‌ రెన్‌షా.

ఇదీ చూడండి : టీమ్ఇండియా WTC Final చేరుకోవడానికి కారణం వీళ్లే

సచిన్ రికార్డ్​పై రోహిత్ కన్ను.. టెస్టు క్రికెట్‌లో సిక్సర్ల కింగ్ ఎవరంటే?

Last Updated : Jun 7, 2023, 7:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.