ETV Bharat / sports

WPL వేలానికి అంతా రెడీ- జాక్​పాట్ కొట్టేదెవరో- లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

WPL 2024 Auction : మహిళల ప్రీమియర్ లీగ్​ 2024 సీజన్​ కోసం వేలం శనివారం జరగనుంది. కాగా, ఈ వేలానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

wpl 2024 auction
wpl 2024 auction
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2023, 7:51 PM IST

WPL 2024 Auction : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలానికి సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో ముంబయి వేదికగా వేలం జరగనునుంది. ఈ క్రమంలో డబ్ల్యూపీఎల్​ను ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దడానికి బీసీసీఐ ఓ కమిటీ వేసింది. మహిళల క్రికెట్​ను ప్రోత్సహిస్తూ, టోర్నీలో పోటీతత్వాన్ని పెంచడంలో ఈ కమిటీ సహాయపడుతుందని బీసీసీఐ తెలిపింది. ఇక డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ 2024 ఫిబ్రవరి - మార్చిలో జరిగే ఛాన్స్ ఉంది.

కమిటీ మెంబర్లు..

  • రోజర్ బిన్ని - బీసీసీఐ ఛైర్​పర్సన్
  • జై షా - కన్వీనర్
  • అరుణ్ ధుమాల్ - ఐపీఎల్ ఛైర్​పర్సన్
  • రాజీవ్ శుక్లా - బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్
  • ఆశిష్ శేలర్ - బీసీసీఐ ట్రెజరరీ
  • దేవజీత్ సైకియా - బీసీసీఐ జాయింట్ సెక్రటరీ

మొత్తం 165 మంది ప్లేయర్లు ఈ వేలంలో అందుబాటులో ఉండనున్నారు. అందులో 104 మంది భారత్​ ప్లేయర్లు కాగా, 61 మంది విదేశీయులు. ఈ వేలంలో ఐదు ఫ్రాంచైజీలు పాల్గొననున్నాయి. మొత్తం 30 స్లాట్​లు ఖాళీగా ఉండగా, అందులో విదేశీయులకు 9 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఫ్రాంచైజీలు అత్యధికంగా 18 కంటే ఎక్కువ ప్లేయర్లను కొనుగోలు చేయడానికి వీల్లేదు. అయితే ప్లేయర్లను రిటెయిన్, రిలీజ్ చేసుకునే గడువు అక్టోబర్ 15కే ముగిసింది. ఈ క్రమంలో 2023 డబ్ల్యూపీఎల్ విన్నర్ ముంబయి ఇండియన్స్ 13 మందిని రిటెయిన్ చేసుకోగా, రన్నర్​ దిల్లీ క్యాపిటల్స్ అత్యధికంగా 15 మందిని అట్టిపెట్టుకుంది.

ఆయా ఫ్రాంచైజీల ఖాళీ స్లాట్​, పర్స్​ వ్యాల్యూ..

ఫ్రాంచైజీపర్స్​ వాల్యూ అందుబాటులో ఉన్న స్లాట్స్‌
దిల్లీ క్యాపిటల్స్‌రూ.2.253
గుజరాత్‌ జెయింట్స్‌రూ.5.95 కోట్లు10
ముంబై ఇండియన్స్‌ రూ.2.1 కోట్లు5
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరురూ.3.35 కోట్లు7
యూపీ వారియర్స్‌ రూ.4 కోట్లు5

డబ్ల్యూపీఎల్ వేలం నింబధనలు ఇవే..

  • ప్రతి ఫ్రాంచైజీ తమ జట్టులో 15 - 18 మంది ప్లేయర్లను కొనుగోలు చేయవచ్చు.
  • ప్రతి ఫ్రాంచైజీ అత్యధికంగా రూ. 12 కోట్లు వేలంలో ఖర్చుచేయవచ్చు.
  • ప్రతి జట్టులో విదేశీ ప్లేయర్లు ఏడుగురికి మించకూడదు.

WPL 2024 Auction live broadcast and streaming : 2024 డబ్ల్యూపీఎల్ వేలం శనివారం (డిసెంబర్ 9న) మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ వేలాన్ని లైవ్​ బ్రాడ్​కాస్టింగ్​ స్పోర్ట్స్​ 18 ఛానెల్​లో, లైవ్ స్ట్రీమింగ్ జియో సినిమాలో ఉచితంగా వీక్షించవచ్చు.

వారం రోజుల్లో డబ్ల్యూపీఎల్ వేలం- 165 మందిలో అదృష్టం వరించేది​ ఎవరినో?

అలా చేస్తే మహిళా క్రికెట్​కు తిరుగుండదు- WPL 2024లో ఆ మార్పు చేయాలి! : స్మృతి మంధాన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.