ETV Bharat / sports

భారత్​లో పుట్టుంటే క్రికెట్ ఆడేవాడిని కాదు: డివిలియర్స్

AB de Villiers IPL: టీమ్​ఇండియాలో చోటు దక్కాలంటే స్పెషల్ టాలెంట్​ ఉండాలని అన్నాడు మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్. ఒకవేళ తాను ఈ దేశంలో పుట్టుంటే క్రికెట్ ఆడేవాడిని కాదని చెప్పాడు.

ABD
ఏబీ డివిలియర్స్
author img

By

Published : Feb 10, 2022, 11:09 AM IST

భారత్ దేశంలో ప్రజలకు, క్రికెట్​కు విడదీయలేని బంధం ఉంది. క్రికెట్ బాగా ఆడితే స్వదేశానికి చెందిన ప్లేయర్లనే కాదు విదేశీ క్రికెటర్లను మనవాళ్లు గుండెల్లో పెట్టుకుంటారు. అలాంటి వారిలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఒకడు.

డివిలియర్స్​కు మన దేశంతో చాలా అనుబంధం ఉంది. టీమ్​ఇండియాతో ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్​లాడిన ఏబీడీ.. ఐపీఎల్​తో కోట్లమంది భారతీయులకు చేరువయ్యాడు. గతేడాదితో ఐపీఎల్​ కెరీర్​కు కూడా ముగింపు పలికాడు. ఈ క్రమంలో ఇటీవల ఆర్సీబీ పాడ్​కాస్ట్​లో మాట్లాడుతూ భారత్​తో పాటు తన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

kohli AB de Villiers ipl
కోహ్లీ-డివిలియర్స్

"భారత క్రికెట్ జట్టులో చోటు దక్కాలంటే స్పెషల్ టాలెంట్ ఉండాల్సిందే. అలా అయితేనే అతడు టీమ్​ఇండియాకు ఆడుతాడు. ఒకవేళ నేను ఇక్కడ పుట్టినాసరే, అంతర్జాతీయ క్రికెట్ ఆడేవాడిని కాదు. కానీ భారత్​లో ప్రజలు ఆటగాళ్లను గుండెల్లో పెట్టుకుంటారు. ఇక్కడ నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే నేను రిటైర్మెంట్​ ప్రకటించినప్పుడు భారత్​లో ఉన్న అభిమానులు కూడా చాలా బాధపడ్డారు" అని డివిలియర్స్ చెప్పాడు.

తన కెరీర్​లో కీలకమైన ఐపీఎల్​ గురించి, అందులో తాను ఆడిన ఆర్సీబీ జట్టు గురించి కూడా డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. ఆర్సీబీ అనేది తనకు కుటుంబంలాంటిదని, ఐపీఎల్ ఆడే అవకాశం ఈ జట్టు వల్లే దక్కిందని ఏబీ అన్నాడు. భారతీయ ప్రేక్షకులకు దాదాపు 15 ఏళ్లు దగ్గరగా ఉండటానికి ఐపీఎల్ సహాయపడిందని పేర్కొన్నాడు.

ఐపీఎల్​లో మొత్తం 184 మ్యాచ్​లాడిన డివిలియర్స్.. 5162 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. లీగ్​ ప్రారంభం నుంచి ఆడుతున్న ఏబీ.. తొలుత ముంబయి జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2011లో ఆర్సీబీకి మారాడు. అప్పటినుంచి గతేడాది వరకు ఆ జట్టులోనే కొనసాగాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.