ETV Bharat / sports

అదరగొట్టిన అమ్మాయిలు.. విండీస్​పై భారీ విజయం

Worldcup 2022 Ind Vs Wi Match: ఐసీసీ మహిళల ప్రపంచకప్​లో భారత క్రికెట్​ జట్టు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 155 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్​పై ఘన విజయం సాధించింది.

cricker
women cricket team
author img

By

Published : Mar 12, 2022, 1:30 PM IST

Updated : Mar 12, 2022, 1:40 PM IST

Worldcup 2022 Ind Vs Wi Match: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్​లో భాగంగా వెస్టిండీస్​తో శనివారం జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టుపై 155 పరుగుల తేడాతో గెలుపొందింది.

318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్​ జట్టుకు ఓపెర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. వేగంగా ఆడుతూ 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఆ ఆర్వాత వికెట్ల పతనం మొదలైంది. కొత్తగా క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు తడబడ్డారు. దీంతో 40.3ఓవర్లలో కేవలం 162 పరుగులకే ఆలౌట్​ అయింది విండీస్​. డియాంద్ర డాట్టిన్(62), హెలే మ్యాథ్యూస్​(43) టాప్​ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడం వల్ల మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. స్నేహ్​ రానా 3, మేఘనా సింగ్​ 2, రాజేశ్వరి గైక్వాడ్​, పూజా వస్త్రాకర్​, జులన్​ గోస్వామి తలో వికెట్​ దక్కించుకున్నారు.

అంతకుముందు టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న భారత్​ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 317 పరుగులు సాధించింది. స్మృతి మంధాన(123), హర్మన్​ ప్రీత్​ కౌర్​(109) శతకాలతో రాణించారు. విండీస్​​ బౌలర్లలో అనిస మహమ్మద్​ 2 వికెట్లు తీయగా.. షమిలియా, షకేరా, హేలే, దయేంద్ర, యాలియా చెరో వికెట్ పడగొట్టారు.

ఇదీ చదవండి: ఐపీఎల్​లో అత్యధికసార్లు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌' వీరికే

Last Updated : Mar 12, 2022, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.