WTC Final 2023 IND VS AUS : ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 రోజు వచ్చేసింది. మరి కొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. పేస్‌కు అనుకూలించే పిచ్‌పై.. ఆసీస్ పేస్ బౌలర్లకు, భారత స్టార్ బ్యాటర్లకు మధ్య పోరుగా ఈ మ్యాచ్‌ను అభివర్ణిస్తున్నారంతా. వీరిలో ఎవరు పైచేయి సాధిస్తారో.. వాళ్లకే టెస్టు ఛాంపియన్‌షిప్ ట్రోఫీ. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాలు, టీమ్ఇండియా ఎవరు గట్టిగా నిలబడాలి, ఆస్ట్రేలియాలో ఎవరిని ఆపగలిగితే మ్యాచ్ మన సొంతం అవుతుంది వంటి వివరాలను తెలుసుకుందాం..
వీళ్లు గట్టిగా నిలబడాలి(WTC Final 2023 Teamindia)..
- రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, పుజారా, కోహ్లీ, రహానెలతో భారత బ్యాటింగ్ బలంగానే కనిపిస్తోంది. కానీ ఈ లైనప్ ఎలా రాణిస్తుందన్నది చెప్పలేం.
- రోహిత్‌కు ఇంగ్లాండ్‌లో మంచి అనుభవం, రికార్డున్నా.. కొద్ది కాలంగా సరైన ఫామ్‌లో లేడు. శుభ్‌మన్ సూపర్ ఫామ్‌లో ఉన్నా.. అనుభవ లేమితో ఇంగ్లాండ్ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటాడో. వీళ్లిద్దరూ కలిసి జట్టుకు ఎలాంటి ఆరంభాన్నిస్తారన్న దానిపై మ్యాచ్ ఆధరపడి ఉంటుంది.
- స్టార్క్, కమిన్స్, బోలాండ్‌లతో కూడిన ఆసీస్ పేస్ త్రయాన్ని ఎదుర్కోవడం రోహిత్, గిల్‌తో పాటు మిగతా బ్యాటర్లకూ సవాల్ అనే చెప్పాలి.
- అలాగే నాలుగో పేసర్‌గా సేవలందించనున్న ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్, స్పిన్నర్ లైయన్ బౌలింగ్‌లోనూ భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాల్సిందే. పిచ్.. స్పిన్‌కు అనుకూలిస్తే లైయన్‌ను ఎదుర్కోవడం అంత తేలిక కాదు.
- మిగతా బ్యాటర్లంతా ఐపీఎల్ ఆడుతుంటే.. ఇంగ్లాండ్ పిచ్‌లపై కౌంటీ క్రికెట్ ఆడుతూ పరుగుల వరద పారించిన పుజారా.. ఈ ఫైనల్లో బ్యాటింగ్‌లో కీలకం కానున్నాడు. అతడిపై భారీ నమ్మకాలు ఉన్నాయి.
- గత కొద్ది రోజులుగా ఫుల్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ తన సత్తా చాటాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇంగ్లాండ్‌లో అతడి భారత బ్యాటర్లందరిలో మెరుగైన రికార్డుంది.
- సీనియర్ బ్యాటర్ రహానె కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఇంకో విషయమేమిటంటే.. అతడు టెస్ట్‌ల్లో సెంచరీ చేసిన ప్రతిసారి టీమ్ఇండియా ఓడిపోలేదు. అతడు తన టెస్ట్ కెరీర్‌లో 12 శతకాలు బాదగా.. వాటిలో టీమ్ఇండియా 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. జడేజా బ్యాటింగ్‌లోనూ కీలకమే.
-
The countdown has begun for #WTC23 Final ⏳#TeamIndia pic.twitter.com/7E120W5cV0
— BCCI (@BCCI) June 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The countdown has begun for #WTC23 Final ⏳#TeamIndia pic.twitter.com/7E120W5cV0
— BCCI (@BCCI) June 5, 2023The countdown has begun for #WTC23 Final ⏳#TeamIndia pic.twitter.com/7E120W5cV0
— BCCI (@BCCI) June 5, 2023
వారిని ఆపాలి(WTC Final 2023 Australia)..
- వార్నర్, ఖవాజా, లబుషేన్, స్టీవ్ స్మిత్, హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ.. ప్రపంచ క్రికెట్లో ఎలాంటి బౌలింగ్‌నైనా బంబేలెత్తింటే టెస్టు బ్యాటింగ్ లైనప్ ఆస్ట్రేలియాది.
- కొద్ది కాలం నుంచి వార్నర్ సరైన ఫామ్‌లో లేకపోయినా.. రీసెంట్గా జరిగిన ఐపీఎల్లో పర్వాలేదనిపించాడు. అతడికి భారత బౌలింగ్‌పై మంచి అవగాహన ఉంది.
- ఖవాజా కొన్నేళ్లుగా స్థిరంగా రాణిస్తూ ఆడుతున్నాడు.
- లబుషేన్ అరంగేట్రం నుంచే పరుగుల వరద పారిస్తున్నాడు.
- ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి బౌలింగ్‌నైనా అలవోకగా ఎదుర్కొని సెంచరీలు బాదగలతాడు స్టీవ్ స్మిత్.
- హెడ్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడగలిగే సత్తా ఉంది
- గ్రీన్, కేరీ కూడా మంచిగా రాణించగల బ్యాటర్లు. ముఖ్యంగా గ్రీన్ ఫార్మాట్‌కు తగ్గట్లుగా బ్యాటింగ్‌లో పరుగులు చేయడం.. మంచి వేగంతో బౌలింగ్ చేయడం ఇతడి స్పెషాలిటీ.
- ఈ లైనప్‌కు షమి, సిరాజ్, ఉమేశ్, జడేజా ఎంత వరకు ఆపగలతారో చూడాలి. ముఖ్యంగా ఖవాజా, లబుషేన్, స్మిత్‌లను ఆరంభంలోనే ఆపకపోతే.. భారీ ఇన్నింగ్స్‌లు ఆడేసి మ్యాచ్‌ను తమవైపు తిప్పేసుకుంటారు.
- షమి అనుభవం, సిరాజ్ ఫామ్‌పైనే ఆశలు ఉన్నాయి. బుమ్రా లేని లోటును ఈ ఇద్దరూ భర్తీ చేస్తారని అందరూ భావిస్తున్నారు. పిచ్‌ను బట్టి నాలుగో పేసర్‌గా శార్దూల్ లేదా రెండో స్పిన్నర్‌గా అశ్విన్ ఆడే అవకాశం ఉండొచ్చు. వీళ్లిద్దరూ బాల్తోనే కాకుండా బ్యాటుతోనూ కీలక పాత్ర పోషించాలి.
-
ON SALE NOW! Tickets to a massive summer of international cricket are officially up for grabs 🎟️
— Cricket Australia (@CricketAus) June 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Don't wait, get yours now!
">ON SALE NOW! Tickets to a massive summer of international cricket are officially up for grabs 🎟️
— Cricket Australia (@CricketAus) June 6, 2023
Don't wait, get yours now!ON SALE NOW! Tickets to a massive summer of international cricket are officially up for grabs 🎟️
— Cricket Australia (@CricketAus) June 6, 2023
Don't wait, get yours now!
రికార్డులు(WTC Final records)
- ఓవల్‌లో 14 టెస్టులు ఆడింది భారత్. అందులో రెండు గెలిచి, ఐదింటిలో ఓడింది. ఏడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇక ఇదే వేదికపై 38 టెస్టులాడిన ఆస్ట్రేలియా.. ఏడింటిలో గెలిచి .. 17 మ్యాచుల్లో ఓడింది. మిగతా మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.
- ఆస్ట్రేలియాతో ఆడిన చివరి నాలుగు టెస్టు సిరీస్‌ల్లోనూ టీమ్ఇండియా విజయం సాధించింది. సొంతగడ్డపై రెండు, ఆస్ట్రేలియాలో రెండు సిరీస్‌లను దక్కించుకుంది. అన్నీ 2-1తోనే భారత్‌కు దక్కాయి.
- ఆస్ట్రేలియాపై టెస్టుల్లో 2 వేల మైలురాయిని కోహ్లీ చేరుకోవాలంటే 21 పరుగులు అవసరం.
- ఓవల్‌లో ఆడిన మూడు టెస్టుల్లో స్టీవ్ స్మిత్ 391 పరుగులు చేశాడు. 97.75 యావరేజ్‌తో. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి.
-
Who will hold the mace at the end of the #WTC23 Final? 💪
— ICC (@ICC) June 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The captains had their say ➡️ https://t.co/lHLFzv4AF4 pic.twitter.com/Tum9LcXYJJ
">Who will hold the mace at the end of the #WTC23 Final? 💪
— ICC (@ICC) June 6, 2023
The captains had their say ➡️ https://t.co/lHLFzv4AF4 pic.twitter.com/Tum9LcXYJJWho will hold the mace at the end of the #WTC23 Final? 💪
— ICC (@ICC) June 6, 2023
The captains had their say ➡️ https://t.co/lHLFzv4AF4 pic.twitter.com/Tum9LcXYJJ
ఇదీ చూడండి:
WTC Final 2023 : ఆసీస్‌తో అంత ఈజీ కాదు.. అందరి ఫోకస్ అతడిపైనే.. అదొక్కటే దెబ్బ!